రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : రైల్ – చుకు చుకు రైలూ ‘దారితప్పిందీ’..!

Saturday, September 24th, 2016, 04:32:42 PM IST

Rail
తెరపై కనిపించిన వారు : ధనుష్, కీర్తి సురేష్..
కెప్టెన్ ఆఫ్ ‘రైల్’ : ప్రభు సాల్మన్

మూల కథ :

రైల్లో టీ, టిఫిన్ అమ్మే పాంట్రీ ఉద్యోగి అయిన ధనుష్, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళే రైలులో సరోజ (కీర్తి సురేష్)ను చూసి ప్రేమలో పడతాడు. వీరి ప్రేమకథ అంతా బాగానే ఉందనుకుంటుండగా, కొన్ని అనుకోని పరిస్థితుల్లో రైలు అదుపుతప్పుతుంది. ఆ తర్వాత ఏమైందన్నదే సినిమా.

విజిల్ పోడు :

1. ప్రభు సాల్మన్ సినిమాలన్నింటికీ ఓ సరికొత్త నేపథ్యం ఉంటుంది. ఈ సినిమాను అంతా రైల్లోనే సెట్ చేయడం ఈసారి చూపిన కొత్తదనం. రైలు చుట్టూనే ఒక రెండున్నర గంటల సినిమా చెప్పాలన్న సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే!

2. ధనుష్ ఎంత మంచి నటుడో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలోనూ తన స్థాయిని మరోసారి చాటుకుంటూ చాలా తెలివిగా, పాత్రకు అవసరమైనట్లుగానే కనిపిస్తూ బాగా మెప్పించాడు. ధనుష్ టైమింగ్‌కు విజిల్స్ వేసుకోవచ్చు.

3. తంబిరామయ్య కామెడీ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పాలి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఆయన తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అతడికి విజిల్స్ వేసుకోవచ్చు

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. సెకండాఫ్ అంతా దారితప్పడం ఈ సినిమాకు అతిపెద్ద ఢమ్మాల్ పాయింట్. ఫస్టాఫ్ బానే ఉందనుకుండగా, సెకండాఫ్‌లో కథనంతా ఎక్కడెక్కడో తిప్పి ఢమ్మాల్ అనిపించారు.

2. రెండున్నర గంటలకు పైనే సినిమా ఉండడం కూడా విసుగు తెప్పించింది. ముఖ్యంగా ఆ సెకండాఫ్‌లో వచ్చే అనవసరమైన కామెడీతో అయితే విసుగు మరీ ఎక్కువైంది.

3. కథలో లాజిక్ అన్నది పట్టించుకోకపోవడమే మంచిది. ఎక్కడ, ఏది, ఎందుకెలా జరుగుతుందో అన్నది లాజిక్‌కి ఏమాత్రం అందకుండా నడుస్తుంది. ఇది కూడా ఢమ్మాల్ పాయింటే!

దావుడా – ఈ సిత్రాలు చూసారా.!!

–> అదేంటో కానీ ఎంతో స్పీడుగా వెళుతున్న ట్రైన్ పైన కూడా హీరో ఇష్టం వచ్చినట్లు తిరుగేస్తుంటాడు. అన్నట్టు ఫైట్లు కూడా చేస్తూంటాడు. ఇదేం సిత్రమో!

–> వందల మంది ఉన్న ఒక రైలు అదుపు తప్పితే దాన్ని కొన్ని చోట్ల జోక్ చేయడమేంటో కూడా సిత్రంగానే కనిపించింది. హీరో, హీరోయిన్ల లవ్ అయితే మరీ ఓవర్ అయింది. తొలిచూపులో ప్రేమలో పడి తనది స్వచ్చమైన ప్రేమని హీరో అనడం, అసలు ఈ లవ్ స్టోరీ అంతా అదో విచిత్రం!

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : ఉఫ్‌ఫ్.. ఇంతసేపు ఉందేంటి సినిమా!?
మిస్టర్ బి : (ఆవలిస్తూ) అయిపోయిందా?
మిస్టర్ ఏ : అయి’పోయింది’. పదా వెళ్దాం!