కోటి రూపాయల లాటరీ తగిలింది అని ఖుష్ అయ్యాడు.. ఇంతలోనే షాక్!

Tuesday, June 12th, 2018, 01:37:32 PM IST

కోటి రూపాయలు లాటరీ తగిలింది అంటే ఎవడైనా సరే సైలెంట్ గా ఉంటాడా? మంచాన పడిన వాడు కూడా ఎగిరి గంతేస్తాడు. ఇక నిరుపేద కుటుంబానికి చెందిన వారు అయితే మరో లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. అదే విధంగా ఇటీవల ఓ కష్ట జీవికి బంపర్ అఫర్ దక్కిందని లాటరీ లో కోటి రూపాయలు వచ్చాయని తెలియగానే ఎగిరి గంతులేశాడు. అయితే ఊహించని విధంగా అది నకిలీ టికెట్ అని చెప్పడంతో ఒక్క నిమిషం ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.

అసలు వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నలసోపరకు చెందిన సుహాస్ కదమ్ అనే వ్యక్తి బ్రెడ్ తయారీ కంపెనీలో పనిచేస్తూ సాయంత్ర వేళలో కూరగాయల విక్రయంతో జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే మార్చి 16న రైల్వే స్టేషన్ లో లాటరీ టికెట్కు కొన్నాడు. ఇక ఇటీవల తీసిన లాటరీలో ఈ టికెట్ నెంబర్ పై రూ.1.11 కోట్ల బంపర్ ప్రైజ్ వచ్చినట్లు అతనికి తెలిసింది. అయితే ఆనందపడే లోపే అది ఫెక్ టికెట్ అని లాటరీ సంస్థ చెప్పింది. దీంతో సుహాస్ ఆశ్చర్యపోయాడు. వెంటనే వారితో వాదించే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఆ తరువాత సుహాస్ పోలీసులను ఆశ్రయించాడు. ఫెక్ టికెట్లు ఎలా అమ్ముతారు పైగా అదే నెంబర్ బార్ కోడ్ బయటకు ఎలా వస్తుంది అని లాటరీ సంస్థ మీద కేసు వేశాడు. ముఖ్యమంత్రి థానే పోలీసు కమిషనర్, రాష్ట్ర లాటరీ విభాగానికి లేఖ రాశాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ మొదలు పెట్టారు.