గుంటూరు లో 10 కోట్ల పెళ్లి .. లోకల్ వింత

Friday, February 17th, 2017, 08:05:26 AM IST


అధికారం లో ఉన్న ఇద్దరు తెలుగు తమ్ముళ్ళు వియ్యంకులు గా మారుతున్న టైం లో ఒక రేంజ్ లో హడావిడి చేసారు. గుంటూరు జిల్లా ఏంటి యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పెళ్లి పెద్ద డిస్కషన్ గా మారింది. గుంటూరు జిల్లా కి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే లు తమ పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టారు , కేవలం భోజనాలకే రెండు కోట్లు ఖర్చు పెట్టారు. ప్రతీ విషయం లో భారీతనం ఉండాలి అని కోరుకుని బోలెడంత ఖర్చు తో అంతా హడావిడి చేసారు. గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ ఎమ్మెల్యే జీవీఆంజనేయులు కుమార్తెకు.. పెదకూరపాడు ఎమ్మెల్యే కుమారుడితో జరిగిన పెళ్లి వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.పెదకూరపాడు ఎమ్మెల్యేకు చెందిన వెంచర్స్ లో 30 ఎకరాల్లో పెళ్లి వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఒకటిన్నర ఎకరంలో పెళ్లి మండపాన్ని ఏర్పాటు చేశారు. వీవీఐపీ.. వీఐపీ.. సాదాసీదా అంటూ మూడు కేటగిరిల్లో ఏర్పాటు చేసిన భోజనాలు భారీగా ఉండటమే కాదు.. ఇందుకోసం రూ.2కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.