యూట్యూబ్ లో అందుకోసం 10వేల ఉద్యోగాలు

Tuesday, December 5th, 2017, 03:03:29 PM IST

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా చాలా పెరిగిపోయింది. వాటి ద్వారా ప్రపంచంలో ఎలాంటి న్యూస్ అయినా క్షణాల్లో మనిషికి తెలిసిపోతోంది. అయితే సోషల్ మీడియా ప్రభావంతో కొన్ని నష్టాలూ కూడా జరుగుతున్నాయి. ఇక యూట్యూబ్ వల్ల కూడా ఎంత లాభం ఉంటుందో అంతేకంటే ఎక్కువ స్థాయిలో నష్టం కూడా కలుగుతోంది. ముఖ్యంగా చిన్నారులపై పెను ప్రభావాన్నే చూపుతున్నాయి. ఎక్కువగా వీడియోల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక అశ్లిల చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో ఎక్కువగా అవే దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇక నుంచి అలాంటి వీడియోలను న్యూస్ లు సోషల్ మీడియాలో కనిపించవద్దని గూగుల్ ఫెస్ బుక్ వంటి కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గూగుల్ యూట్యూబ్ లో అసభ్యకర వీడియో లను ఇక నుంచి కనిపించకుండా చేయాలనీ గూగుల్ టార్గెట్ పెట్టుకుంది. ఒక స్పెషల్ టీమ్ ను కూడా రెడీ చేయనుంది. అందుకోసం 10వేల ఉద్యోగాల నియామకాన్ని చేప్పట్టనున్నట్లు యూట్యూబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సూసన్‌ వోజికి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments