టాలెంట్ ఉంటే పదేళ్ల వరకు వీసా.. అమెరికాకు పోటీగా యూఏఈ!

Tuesday, May 22nd, 2018, 01:16:24 AM IST

ప్రస్తుతం విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా లేక ఉద్యోగం చేసుకోవలన్నా వీసా విషయం కష్ట తరంగా మారింది. ముఖ్యంగా అమెరికాలో అయితే ట్రంప్ వచ్చిన తరువాత వీసా పొందడంలో రూల్స్ ని కఠినంగా మార్చారు. దీంతో భారత్ టెకీలకు భారంగా మారింది. అయితే సంపన్న దేశాల్లో ఒకటైన యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ( యూఏఈ) భారత్ కు మంచి అఫర్ ప్రకటించింది. కేవలం ఇండియన్స్ కి అనే కాకుండా టాలెంట్ ఉన్న టెకీలకు దుబాయ్ స్వాగతం పలకలని వీసా నిబంధనలను సులభతరం చేసి పదేళ్ల వరకు గడువును పొడిగించడానికి సిద్ధమయ్యారు. అదే విధంగా విద్యార్థులు కూడా పదేళ్ల వరకు యూఏఈ లో ఉండే విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రీసెంట్ గా ఆ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తమ్‌ అధ్యక్షతన నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడి దారులకు కూడా అవకాశం ఇవ్వడానికి యూఏఈ అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది.

  •  
  •  
  •  
  •  

Comments