100కోట్ల డీల్ సెట్ చేస్తే 5కోట్లు ఖాతాలో!!

Saturday, October 13th, 2018, 11:02:41 AM IST

హైద‌రాబాద్‌లో ప్రైమ్ ఏరియాలో రియ‌ల్ బిజినెస్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. అనునిత్యం ఒక్క న‌గ‌రాన్ని న‌మ్ముకుని రియ‌ల్ బ్రోక‌ర్లు కోట్లకు కోట్లు సొంత అకౌంట్లలో వేసుకుంటూ కోటీశ్వ‌రులు అవుతున్న వైనం క‌నిపిస్తోంది. తాజాగా అలాంటిదే ఓ బిగ్ డీల్. ఈ ఒక్క డీల్‌తో ఓ రియ‌ల్ బ్రోక‌ర్ ఏకంగా 5 కోట్లు ఖాతాలో వేసుకున్నాడంటే షాక్ తిన‌కుండా ఉండ‌లేం.

హైద‌రాబాద్ ద‌ర్గా నుంచి గ‌చ్చిబౌళి వెళ్లే రోడ్‌కి ఇరువైపులా కొన్ని వేల కోట్ల‌తో భారీ మ‌ల్టీప్టెక్సులు, మాల్స్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డే ద‌ర్గా జంక్ష‌న్ దాటాక‌, పెట్రోల్ బంక్‌ను ఆనుకుని ఉన్న 20ఎక‌రాల చెరువును జీహెచ్ఎంసీ ల‌క్ష‌లు వెచ్చించి అభివృద్ధి చేస్తోంది. గ‌ణేష నిమ‌జ్జ‌నాల‌కు ట్యాంక్ బండ్ త‌ర్వాత ఆల్ట‌ర్నేట్ ఆప్ష‌న్ గానూ ఈ చెరువును మొన్న‌టి రోజున ఉప‌యోగించారు. స‌రిగ్గా ఈ చెరువుకు ఆపోజిట్ .. రోడ్ ఆవ‌ల వేల కోట్ల మేర వెచ్చిస్తూ భారీ మాల్స్ నిర్మాణం సాగుతోంది. ఈ ఏరియా ప్రైమ్ బిజినెస్ ఏరియాగా రూపాంత‌రం చెందుతోంది. గ‌చ్చిబౌళికి కూత‌వేటు దూరంలో ఉన్న ఈ ఏరియాలోనే సాఫ్ట్ వేర్ హ‌బ్ అంత‌కంత‌కు విస్త‌రిస్తోంది. కొత్త బిల్డింగులు నిర్మాణం పూర్తి కాక‌ముందే బోలెడంత బిజినెస్ సాగిపోతోంది. ఇక ఇక్క‌డ గ‌జం ల‌క్ష‌ల్లో ఉంది. ఎక‌రం 100 కోట్లు పైగానే ప‌లుకుతోందంటే అర్థం చేసుకోవ‌చ్చు. తాజాగా ఈ ఏరియాలో కాజ‌గూడ‌- స‌న్‌షైన్ ఆస్ప‌త్రికి ఆపోజిట్ ఎక‌రం 100 కోట్లు చొప్పున‌ డీల్ సెట్ చేశార‌ని తెలుస్తోంది. ఈ డీల్‌లో రియ‌ల్ బ్రోక‌ర్‌కి ఏకంగా 5 శాతం క‌మీష‌న్ చొప్పున ఓ అమెరికా ఎన్నారై నేరుగా అత‌డి ఖాతాలోకి మ‌ళ్లించాడ‌ట‌. దాదాపు రెండెక‌రాల మేర డీల్ కుదిరింద‌ని, 10కోట్ల మేర బ్రోక‌ర్‌కే ఆ ఒక్క డీల్‌లో చెల్లించార‌ని మాట్లాడుకోవ‌డం క‌ళ్లు భైర్లు క‌మ్మే నిజాన్ని బ‌య‌ట‌కు తెచ్చింది. ఇక‌పోతే కాజ‌గూడ‌కు రెండు కి.మీల దూరంలో ఉన్న‌ జేఆర్‌సీ ఆపోజిట్ ఎక‌రం 100కోట్లు ప‌లుకుతోంది. ఇక్క‌డ ప‌లువురు సినిమా నిర్మాత‌ల‌కు ఎక‌రాల్లో భూములు ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం ఇవి వావాదాల్లో ఉండ‌డంతో కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగుతోంద‌న్న‌ మాటా వినిపిస్తోంది. ఈ డీల్స్ సెట్ చేసే బిగ్ రియ‌ల్ బ్రోక‌ర్ ఎవ‌ర‌న్న‌ది అప్ర‌స్తుతం. అస‌లు హైద‌రాబాద్ ప్రైమ్ ఏరియాలో రియ‌ల్ బిజినెస్ ఏవిధంగా సాగుతోందో చెప్పుకోవ‌డానికి ఇదో ఎగ్జాంపుల్ మాత్ర‌మే. ఇలా నిత్యం వేల కోట్ల బిజినెస్ సాగుతుంటుంది కేవ‌లం బ్రోక‌ర్ల‌పై న‌మ్మ‌కంతో!! ద‌ట్సిట‌!!!