వందరోజుల్లో వందతప్పులు

Tuesday, September 9th, 2014, 03:23:45 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి వందరోజుల పాలన అంతా తప్పుల తడకగా ఉందని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కెసిఆర్ పాలన హిట్లర్ పాలనను తలపించే విధంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన ప్రజలలో సంతోషం కనిపించడం లేదని పొన్నాల అన్నారు. హామీలు ఇచ్చి కెసిఆర్ స్వర్గం చూపించారని.. కాని వాటి అమలులో మాత్రం నరకం చూపిస్తున్నారని.. పొన్నాల తెలిపారు. తప్పులు చేయడంలో శిశుపాలుడిని మించిపోయాడని..అబద్దాలు చెప్పడంలో ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచారని పొన్నాల వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన వచ్చాక ఇప్పటివరకు 167 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని… తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాలను కెసిఆర్ ఆదుకోవడంలో విఫలమయ్యారని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ వందరోజుల పాలనలో వంద తప్పులు చేశారని, ఆ తప్పులపై పుస్తకం రాయొచ్చని అన్నారు.