జేబులో రూ500 ఉన్న వ్యక్తికన్నా.. 100 నోటు ఉన్నోడే హీరో…!!

Wednesday, November 9th, 2016, 08:30:16 AM IST

100
నిన్నటివరకు జేబులో రూపాయలు ఐదు వందలు, వెయ్యి ఉన్నవాడే హీరో గా ఫీలయ్యాడు. కానీ నేడు ఆ నోట్ల స్థానాన్ని వంద నోటు ఆక్రమించింది. ఇంట్లో కట్టలు కట్టలు ఐదు వందలు, వెయ్యి నోట్లు ఉన్నాయని సంబర పడ్డ వారందరికీ మోడీ తీసుకున్న నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు జేబులో వంద నోటు ఉంటే ఆ కిక్కే వేరు అన్నకాడికి రాత్రికి రాత్రే పరిస్థితి తలక్రిందులైంది. ఇప్పుడు జేబులో ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు ఉన్నవాడికంటే వంద నోటు ఉనవాడే ఇప్పుడు హీరో. ఎందుకంటే ఇప్పుడు వంద నోటు ఉన్నవాడికే విలువ ఎక్కువ. రాత్రికి రాత్రే కొందరి జీవితాలు తలక్రిందలు అవుతాయంటే అందరు చెబితే విన్నాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మోడీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కొందరి జీవితాల్లో వెలుగు నింపుతే, మరి కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపింది.