రానున్న సంవత్సరంలో తిరుపతిలో 1080 ఉద్యోగాలు : ఐ టి మంత్రి లోకేష్

Sunday, January 14th, 2018, 02:40:57 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐ టి మరియు పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ నేడు తిరుపతి విచ్చేసారు. అక్కడ ప్రారంభమవుతున్న 7 నూతన కంపెనీ లకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, త్వరలో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్న ఈ 7 కంపెనీల ద్వారా మొత్తం 1080 ఉద్యోగాల ద్వారా యువతకు ఉపాధి దొరకనున్నట్లు తెలిపారు. మెడికల్ బిల్లింగ్ మరియు తదితర అనుబంధ సర్వీసులు అందించడం ద్వారా ఏ జి ఎస్ కార్పొరేషన్ వచ్చే రెండు సంవత్సరాలలో 800 ఉద్యోగాలు. యు ఎస్ ఏ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే లోట్ & బ్లాక్ చైన్ టెక్ సంస్థ ద్వారా 100 ఉద్యోగాలు. హాస్పిటల్ దాని అనుబంధ సర్వీసులు అందించే నైస్ టెక్ ద్వారా 100 ఉద్యోగాలు. మొబైల్, బిజినెస్ అప్లికేషన్స్ అభివృద్ధి సంస్థ వై ఐ ఐ టి ద్వారా 250 ఉద్యోగాలు. సుదూర అవస్ధాపన నిర్వహణ సంస్థ ఏ యెన్ ఎస్ ద్వారా 150 ఉద్యోగాలు. బక్కెను కార్యకలాపాల మద్దతు అందించే ఇంజినిస్ ద్వారా 100 ఉద్యోగాలు. ఆర్ధిక కార్యాలపాల నిర్వహణ తదితర సేవలు అందించే పారికర్ సంస్థ ద్వారా మరొక 300 ఉద్యోగాలు. మొత్తంగా చూస్తే రానున్న సంవత్సరం లో ఈ 7 కంపెనీలు 1080, అలాగే తదుపరి సంవత్సరం లో 1800 ఉద్యోగాలు కల్పించనున్నాయని ఆయన తెలిపారు. ఈ విధంగా తిరుపతి లో కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకి రావడం మంచి పరిణామమని, దీనిని భారత దేశంలో ఉత్తమ పెట్టుబడుల గమ్యంగా తయారుచేసేందుకు అన్నివిధాలా శ్రమించి మరిన్ని ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం అని ఆయన అన్నారు.