ప్రత్యేకహోదా రాలేదని పదో తరగతి విద్యార్థి బలిదానం..కానీ వేరే కారణం కూడా..?

Tuesday, September 18th, 2018, 10:30:37 AM IST

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను నమ్మించి మోసం చేసిన దానికి అతి పెద్ద నిదర్శనం “ప్రత్యేకహోదా” ఇవ్వకపోవడం. ఆంధ్ర ప్రజల సాక్షిగా నరేంద్ర మోడీ వారు కేంద్రంలో అధికారంలోకి వస్తే 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్ధానం చేశారు.వారు అనుకున్న విధంగానే గెలిచారు కానీ ఆంధ్ర ప్రజలని నమ్మించి మోసం చేశారు అని వేరే చెప్పనవసరం లేదు.ప్రత్యేకహోదా అంశంలోనే ఎంతో మంది మనస్తాపంతో వారి ప్రాణాలను తీసుకుంటున్నారు.ఇప్పుడు కూడా ఇలాంటి ఒక చేదు సంఘటనే మళ్ళీ ఎదురయ్యింది.కానీ ఈ సారి మరణించింది మహేంద్ర అనే ఒక పదో తరగతి విద్యార్థి.

కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం అనే గ్రామంలో ఈ చేదు సంఘటన చోటు చేసుకుంది.పేద కుటుంబంలో పుట్టినా సరే మహేంద్ర యొక్క అన్నయ్య కష్టపడి డిగ్రీ వరకు చదువు పూర్తి చేసాడు.ఇక ఆ తర్వాత నుంచి అసలైన కష్టాలు మొదలయ్యాలి నిరుద్యోగం అనే భూతం అతన్ని నీడలా వెంటాడింది.ఉద్యోగం దొరకట్లేదు.. ఈ అన్ని విషయాలను గమనిస్తున్న మహేంద్ర వార్తలను ఎక్కువ అనుసరించేవాడు అని ప్రత్యేకహోదా వచినట్లు ఐతే వాళ్ళ అన్ని కష్టాలు తీరుతాయని, వాళ్ళ అన్నయ్యకి మంచి ఉద్యోగం వస్తుందని వారి కుటుంబ సభ్యులతో తరచూ చెప్తూ ఉండేవాడని తెలిపారు. ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా ప్రత్యేకహోదా రాకపోవడంతో వాళ్ళ అన్నయ్యకు ఉద్యోగం దొరకట్లేదు అని తీవ్ర మనస్తాపం చెందాడు.తెలంగాణా వాసులు ఎన్నో బలిదానాలు చేసి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నారు,అదే విధంగా ఆంధ్రరాష్ట్రంలో కూడా బలిదానం చేసుకుంటే ప్రత్యేకహోదా ఇస్తారంటే తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడి ఒక లేఖ రాసి ప్రత్యేక హోదా కోసం తన ప్రాణాలను అర్పించాడు.