శునకంతో పెళ్లి చేస్తే అనారోగ్యం నయమవుతుందా..?

Tuesday, February 28th, 2017, 10:55:20 AM IST


ఒడిశాలో ఓ వింత పోకడ వెలుగులోకి వచ్చింది. దేశ ప్రజలు ఇంకా మూఢ నమ్మకాల్లో మగ్గుతున్నారనడానికి ఇదే నిదర్శనం.ఒడిశాలోని బాలసోర్ జిల్లా గోపాల్ పూర్ గ్రామం లో జరిగిన ఈ వింత ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బిశ్వనాథ్ సింగ్ 11 నెలల కుమార్తె అనారోగ్య పాలైంది. ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో అక్కడ ఉన్న ఆచారం ప్రకటం పాపని శునకంతో పెళ్లి చేస్తే మంచిదని భావించాడు.అనారోగ్యపాలైన వారిని శునకంతో పెళ్లి చేస్తే వారికి నయమవుతుందని అక్కడ ఉన్న ఆదివాసీలు నమ్ముతారు.

అలాగే బిశ్వ సింగ్ కూడా 11 నెలల చిన్నారికి శునకంతో వివాహం చేసాడు.అక్కడ ఉన్న ఆచారం ప్రకారం చెరువు నుంచి తీసుకుని వచ్చిన రెండు కలశాల నీటితో చిన్నారికి స్నానం చేయిచారు. ఆ నీళ్లు శునకంపై పడేట్లుగా ఏర్పాటు చేశారు. అనంతరం శునకం కాలికి సింధూరం రాసి దానిని చిన్నారికి బొట్టుగా పెట్టారు. దీనితో వివాహ కార్యక్రమం ముగిసింది. ఆదివాసీల్లో ఇలాంటి ఆచారాలు ఎక్కువగా ఉండడం గమనిస్తూనే ఉంటాం.