130 మంది ఎమ్మెల్యేల కిడ్నాప్..శశికళ ఎక్కడ దాచింది..?

Wednesday, February 8th, 2017, 05:08:37 PM IST


తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని శశికళ పావులు కదుపుతోంది. తనకు మద్దత్తుగా ఉన్న 130 మంది ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తనకు మద్దత్తు గా ఉన్న 130 మంది ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి బస్సులో తరలించింది. వీరందరిని ఓ హోటల్ దాచినట్లు సామాచారం అందుతుండగా, మరికొందరు హోటల్ కు కాదని వేరే ప్రాంతానికి తరలించారని ప్రచారం జరుగుతోంది.

తాను ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టడానికి ఆటంకాలు అన్ని తొలగేవరకు వారిని అక్కడే ఉంచనున్నట్లు కూడా తతెలుస్తోంది. ఈ లోపు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ దక్కితే వారందని రాష్ట్రపతి ముందు హాజరుపరిచి తన బలాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేసమయం లో రాష్ట్రపతికి గవర్నర్ తీరుపై కూడా ఫిర్యాదు చేసే ఆలోచనలో అన్నాడీఎంకే వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.