గిన్నీస్ రికార్డులో రోబోలు … ఒకేసారి 1,372 రోబోలు డ్యాన్స్ చేశాయి

Tuesday, April 3rd, 2018, 12:43:25 PM IST

సామాన్య ప్రజలకు రోబో అంటే శంకర్ సినిమాలో రజినీకాంత్ మాత్రమే అని తెలుసు, నిజానికి ఇప్పుడు శాస్త్రవేత్తలు మనుషులకంటే రోబోలపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు. వాళ్ళ జీవితం అంతా ధారపోసి టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త రోబోలను తయారు చేస్తూ ప్రపంచం గర్వించే విధంగా నిలుస్తున్నారు. అయితే ఇటివల రోబోల పేరిట కొత్త గిన్నిస్ రికార్డ్ నమోదైంది. 1,372 మానవరూపంలో ఉన్న రోబోలు ఏకకాలంలో నాట్యమాడి గిన్నిస్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాయి. డ్యాన్స్ రోబోలకు ప్రజాదరణ తేవడం కోసం పలు కంపెనీలు గత మూడేండ్లుగా ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నాయి. గత ఏడాది చైనాలో 1,069 దోబీ రోబోలు డ్యాన్స్ చేసి స్థాపించిన రికార్డును ఇటలీ వేదికగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమం అధిగమించింది. పలు సినిమాల్లోని సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేసిన రోబోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్యుమినియం మిశ్రమంతో తయారుచేసి ప్లాస్టిక్ కోటింగ్ వేసిన ఈ రోబోలు 40 సెంటీమీటర్ల ఎత్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments