రూ.15లక్షల ఉద్యోగం వదిలేసి ఆ జంట ఏమి చేశారో తెలిస్తే షాక్ అవుతారు!

Friday, April 20th, 2018, 02:42:32 AM IST


సాధారణంగా ఎవరైనా కష్టపడి పనిచేసేది పొట్ట కూటికొరకే. అయితే మనకు వచ్చే ఆదాయం కాస్త ఎక్కువగా ఎక్కడ అయితే వస్తుందో అటువంటి ఉద్యోగం కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. మనలో ఎక్కువమంది ఇలానే ఆలోచిస్తారు అనుకోండి. అయితే ఇటీవల ఒక జంట ప్రవర్తించిన తీరుకు మనకు ఆశ్చర్యం వేయకమానదు మరి. ఇటీవల నాగపూర్ లోని ఓ జంట ఏకంగా లక్షల్లో వేతనం వస్తుంటే దాన్ని వదులుకుని తమకు నచ్చిన ఒక దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. విషయంలోకి వెళితే పేరున్న ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం, లక్షల్లో వేతనం, అయినా ఏదో అసంతృప్తి. రోజూ పొద్దున్నే లేచి ఠంచనుగా ఆఫీస్‌కు వెళ్లడం, రావడం ఇదే జీవితం కాదనుకున్నారు ఆ భార్యాభర్తలు.

రొటీన్‌ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి కాస్త విభిన్నంగా ఉండాలనుకున్నారు. అందుకే లక్షల జీతాన్ని వదులుకుని సొంతంగా టీ దుకాణం ప్రారంభించారు. పుణెకు చెందిన నితిన్‌ బియానీ, పూజ దంపతులు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. ఐబీఎం, కాగ్నిజెంట్‌ లాంటి ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసి నెలకు రూ. 15లక్షల వేతనం అందుకున్నారు. అయితే ఆ జీవితం వారికి సంతృప్తినివ్వలేదు. తమకంటూ ఏదో ప్రత్యేకత కావాలనుకున్నారు. దాని కోసం ఉద్యోగాలను కూడా వదులుకున్నారు. అయితే వీరికి టీ అంటే చాలా ఇష్టం. ఆ వ్యాపారమే ఎందుకు చేయకూడదు అనుకున్నారు. అలా ఐదు నెలల కిందట నాగ్‌పూర్‌లో ‘ఛాయ్‌ విల్లా రిఫ్రెష్‌ యువర్‌సెల్ఫ్‌’ పేరుతో ఒక టీ దుకాణాన్ని ప్రారంభించారు.

ఈ ఛాయ్‌ విల్లాలో 15 రకాలకు పైగా టీ, కాఫీలను విక్రయిస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా కూడా ఆర్డర్లు తీసుకుంటున్నారు. అలానే బ్యాంకులు, ఆఫీస్‌లు, హాస్పిటల్‌ వంటి వాటికి టీ డెలివరీ చేస్తున్నాం అంటున్నారు. త్వరలోనే మా వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నాం అని నితిన్‌ చెబుతున్నారు. అయితే అనతికాలంలోనే ఈ ఛాయ్‌ విల్లా నాగ్‌పూర్‌లో ఎంతగానో ఫేమస్‌ అయ్యింది. సోషల్‌మీడియా, టెక్నాలజీని ఉపయోగించుకోవడం, అందుబాటు ధరల్లో విక్రయిస్తుండటంతో యువత నుంచి మంచి డిమాండ్‌ వస్తోంది. ఈ ఛాయ్‌విల్లాతో ప్రస్తుతం నెలకు రూ. 5లక్షల దాకా సంపాదిస్తున్నామని నితిన్‌ చెప్పారు. మన పెద్దలు అన్నట్లు బుర్రకు బుద్ధి, జిహ్వకో రుచి మరి…..

  •  
  •  
  •  
  •  

Comments