మంగళగిరి లో నేడు 16 ఐటి కంపెనీలు ప్రారంభం !

Wednesday, January 17th, 2018, 11:04:28 AM IST

రాజధాని అమరావతి అభివృద్ధి లో భాగం గా గుంటూరు జిల్లా మంగళగిరి లో నేడు ఒకేసారి 16 ఐటి కంపెనీ లు ప్రారంభం కానున్నాయి. ఐటి మరియు పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ వీటిని ప్రారంభించనున్నారు. ఇటువంటి కంపెనీల రాక వల్ల ఉద్యోగ అవకాశాలు మరింత పెరగపోతున్నాయి. బివిజి, మెక్ మై క్లినిక్, ఎక్సెల్లార్, డీఎఫ్ఐ స్విస్, సువిజ్, పిక్సీ, సన్ స్వెట్, స్వరా సాఫ్ట్ , స్క్రిప్ట్ బీస్ , అద్వైత్ అల్గారిథం, చారు వీకెంట్ ఐటిఈఎస్, సిగ్నమ్ డిజిటల్ నెట్వర్క్. ఈ ఐటి కంపెనీ ల రాక వల్ల జిల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పెట్టుబడులకు ముందుకు రావడం మంచి శుభ పరిణామమని ఇది రాజధాని అభివృద్ధిని మరింత త్వరగా ముందుకి తీసుకెళ్లడంలో ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంటున్నారు….