యూపీలో మరో దారుణమైన ఘటన.. పొదల్లోకి తీసుకెళ్లి..

Tuesday, July 24th, 2018, 04:14:55 PM IST

చట్టాలు ఎన్ని మారుతున్నా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా మహిళలపై దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటనలు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక ఘటన మరవకముందే మరో దారుణం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. రీసెంట్ గా యూపీలో టీనేజ్ బాలికపై యువకులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో ద్వారా బయటకు తెలిసింది.

ఈ నెల 12న ఒక యువతి తల్లికి భోజనం తీసుకెళ్లడానికి పంట పొలానికి బయలుదేరింది. ఒంటరిగా వెళుతున్నందువల్ల ఒక బాలుడిని తనతో పాటు తోడుగా రమ్మంది. అయితే దారిలో అడ్డగించిన కొందరు యువకులు వారిని వివిధ రకాల ప్రశ్నలతో వేదించారు. యువతి చేయి పట్టుకొని పొదల్లోకి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి తనని ఏమి చేయవద్దని ఎంతో ప్రాధేయపడింది. ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నారని అల్లరి మూకలు ఆ అమ్మాయిని ప్రశ్నించగా కేవలం తన తల్లికి భోజనం ఇవ్వడానికి వెళుతున్నట్లు వివరణ ఇచ్చింది. అంతవరకు ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments