వైరల్ వీడియో : అయ్ అచ్చం మనిషిలాంటి కోతి

Sunday, March 25th, 2018, 10:44:47 PM IST

మనిషి కోతి జాతి నుంచి పుట్టుకొచ్చాడని మన పూర్వీకులు, కొంతమంది శాస్త్రవేత్తలు గతంలోనే వెల్లడించిన విషయం ఇప్పుడు అక్షరాలా సత్యం అయిందని తెలియకనే తెలుస్తుంది. సాధారణంగా కోతి ముందు మనం ఏవిధంగా ప్రవర్తిస్తామో.. అది కూడా ఆ మాదిరిగానే అనుకరించేందుకు ప్రయత్నిస్తుంది. మనం కోతి నుంచి వచ్చామనడానికి ఇప్పుడు ఈ వీడియోనే నిదర్శనం. తాజాగా మనిషిలాంటి ముఖంతో ఉన్న కోతి ఫొటోలు, వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 18ఏళ్ల కోతి కళ్ల కదలికలు, నోరుతో పాటు మఖ కవళికలు చూడటానికి అచ్చం చామనచాయ రంగులో ఉన్న మనిషిలానే కనిపించడంతో పాటు భయంతో ఆందోళన చెందుతున్నట్లు హావభావాలను ప్రదర్శించడంతో ఇది అందరినీ విపరీతంగా ఆకర్షింపజేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో చైనా సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్ వైబోలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 8మిలియన్ల మంది వీక్షించడం విశేషం. చైనాలోని తియాంజిన్ జూలో ఉన్న కోతి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయింది. దీన్ని ప్రపంచం అంతా తెలియజేసేలా ఓ ప్రత్యేకమైన ఎక్సిభిషణ్ షో చేయాలని చైనా ప్రభుత్వం యోచిస్తుందట. ఇంకెందుకు ఆలస్యం మరి ఈ వీడియోను చూసేయండి.