ప్రాణం తీసిన ఐపీఎల్!

Thursday, April 12th, 2018, 12:40:24 AM IST

ఐపీఎల్ వచ్చిందంటే చాలు యువత మొత్తం టీవీల ముందు వాలిపోతారు. ఇంట్లో వాళ్లు ఎంత చెప్పినా కూడా వేరే పనుల చేయడానికి ఇష్టపడరు. అయితే రీసెంట్ గా కొడుకు ఐపీఎల్ చూస్తుండగా తల్లి టీవీ ఆఫ్ చేసిందని అతను తీసుకున్న నిర్ణయం ముంబైలో సంచలనం సృష్టించింది. క్షణికావేశంలో కొడుకు ప్రాణాలు తీసుకోవడం కుటుంబాన్ని షాక్ కి గురి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా ముంబైలో అనిల్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది.

అనిల్ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. అయితే పెద్దవాడైన నీలేష్ గుప్తాకి(18) క్రికెట్ అంటే పంచ ప్రాణాలు. రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా తల్లి అతన్ని వాటర్ ట్యాంక్ చెక్ చేయమని చెప్పింది. కానీ అతను పట్టించుకోలేదు. దీంతో తల్లి ఆవేశంతో వాదించి టీవీ ఆఫ్ ఆఫ్ చేయడంతో నీలేష్ బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. తల్లి బయటికి వెళ్లి 15 నిమిషాల్లో పని చూసుకొని తిరిగివచ్చే సరికి ఇంటి లోపలి నుంచి లాక్ చేసి ఉంది. ఎంత అరిచినప్పటికీ డోర్ తీయకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతి కష్టం మీద మొత్తానికి లాక్ తీశారు. అయితే కుమారుడు అప్పటికే ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు గుర్తించి హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. డాక్టర్లు చనిపోయినట్లు చెప్పడంతో పోలీసులు కూడా విచారణ జరిపి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని నిర్దారించారు.

  •  
  •  
  •  
  •  

Comments