“2.0” మరో “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” కాబోతుందా..?

Wednesday, December 5th, 2018, 11:51:55 PM IST

భారతదేశ సినీ పరిశ్రమలోనే “బాహుబలి 2” చిత్రం తర్వాత మళ్ళీ అంత హైప్ తో వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది “2.0” సినిమా అనే చెప్పాలి.శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్,మరో పక్క బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లాంటి అగ్ర నటులు,భారీ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం 3D లో తెరకెక్కింది.అయితే ఈ చిత్రం బాహుబలిని చూసి దాన్ని దాటడానికే తెరకెక్కించారని చెప్పడానికి లేదు.కానీ మన బాహుబలి చిత్రాన్ని చూసి చేతులు కాల్చుకున్నటువంటి చిత్రాల జాబితాలోకి ఈ చిత్రం చేరిపోతుందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి.అలా వచ్చిన సినిమాల్లో “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” చిత్రం కూడా ఒకటి ఆ చిత్రం బాహుబలిని బీట్ చేసేస్తుందని ఎన్నో అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

కానీ ఇక్కడ 2.0 చిత్రానికి వచ్చినట్టయితే భారీ ప్రాజెక్ట్ శంకర్ మార్క్ సినిమా అయినా సరే ఆ స్థాయి వసూళ్లు అయితే రాబట్టడం లేదు అనే చెప్పాలి.ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అయితే బాగానే చూస్తున్నా సరే బాహుబలి చిత్రాలను ఆదరించిన స్థాయిలో అయితే ఈ చిత్రాన్ని ఆదరించడం లేదు అనే చెప్పాలి.ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాల ప్రకారం అయితే ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు తక్కువనే చెప్పాలి.ఇప్పటికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 కోట్లు రాబట్టినట్టు అంచనా. ఇంకా చాలా వరకు ఈ చిత్రం రాబట్టాల్సి ఉందట,ఇక ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వచ్చి ఆగుతుందో వేచి చూడాలి దీన్ని బట్టే ఈ చిత్రం యొక్క రిజల్ట్ ఏమిటి అన్నది తెలుస్తుంది అని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు.