న్యాయస్థానం తీర్పు: ఇద్దరికి ఉరిశిక్ష.. ఒకరికి యావజ్జీవం!

Tuesday, September 11th, 2018, 10:30:04 AM IST

2007 హైదరాబాద్ జంట పేలుళ్లపై న్యాయస్థానం అనూహ్య తీర్పును వెలువరించింది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల బాంబు పేలుళ్ల ఘటన దేశ ప్రజల్ని ఏ స్థాయిలో బయపెట్టిందో అందరికి తెలిసిందే. అయితే ఘటనపై గతవారమే చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్‌ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఈ జంట పేలుళ్లలో అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి‌, అనీఖ్‌ షఫిక్‌ సయ్యద్‌లక సెక్షన్‌ 302 కింద అభియోగాలు నమోదవ్వడంతో విచారణ అనంతరం వారిని దోషులుగా ప్రకటించింది. అయితే సోమవారం వారికి శిక్షలు విధించారు.

హత్య, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడం వంటి నేరాల కింద అనీక్‌ షఫీక్‌ సయీద్, మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలకు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఇక మారణహోమానికి పాల్పడిన దోషులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్‌ అంజూమ్‌ ఎహసాన్‌ ను సైతం న్యాయస్థానం దోషిగా నిర్ధారిస్తు అతనికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే విధంగా ఒక్కొక్కరికీ రూ.10 వేల జరిమానా విధించింది. ఇక అనీక్, ఇస్మాయిల్‌ చౌదరిల ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు ఖరారు చేసేంత వరకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అధికారం ఉండదు.

2007, డిసెంబర్‌ 25న జరిగిన లుంబనీ పార్క్, గోకుల్‌ చాట్‌ బ్లాస్ట్ ల వలన ఎంతో మంది మరణించారు, మరికొందరు తీవ్రంగా గాయాలపాలై అవిటివాళ్లయ్యారు. మరో బాంబు పేల్చేందుకు దిల్‌సుఖ్‌నగర్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్ద పెట్టిన బాంబును పోలీసులు నిర్వీర్యం చేసిఎక్కువ ప్రాణనష్టం జరక్కుండా చేశారు. లుంబినీ పార్క్‌ పేలుడులో 12 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. గోకుల్‌చాట్‌ పేలుళ్ల కారణంగా 47 మంది గాయపడటమే కాకుండా 32 మంది మృతి చెందారు.

  •  
  •  
  •  
  •  

Comments