ఆ పదం వాడినందుకు యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష!

Sunday, March 11th, 2018, 07:24:52 PM IST

ఇటీవలి కాలంలో మహిళల పై దాడులు, లైంగిక వేధింపులు బాగా పెరిగాయి. అందుకు ప్రధాన కారణం నేటి యువత అవలంబిస్తున్న నూతన విధానాలు, పోకడలు అని మానసిక నిపుణులు అంటున్నారు. అంతేకాక తల్లితండ్రులు కూడా తమ బిడ్డల ప్రవర్తన తీరుపై కొంత మేర అవగాహన కలిగి ఉండాలని, వారిలో ఏదైనా తప్పు ఉంటే వాటిని తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకుని సరిచేయాలని అభిప్రాయపడుతున్నారు. తాజాగా జరిగిన ఒక ఘటన లో నోరు అదుపులో పెట్టుకోకుండా, రోడ్డు పై వెళుతున్న యువతిని అసభ్య పదజాలంతో దూషిస్తే పంకజ్ సింగ్ (23)కు పట్టిన గతే పడుతుంది. అసలు విషయం లోకి వెళితే 2017 సెప్టెంబరు 4న బాధిత యువతి కళాశాల నుంచి ఇంటికి వెళ్తూండగా సెక్టర్ 11లో నిలబడి వున్న పంకజ్ సింగ్ చూశాడు.

వెంటనే ఆమెను అడ్డగించి టీజింగ్ చేయడం ప్రారంభించాడు. ‘హే సెక్సీ’ అని సంబోధిస్తూ టీజ్ చేశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన పంకజ్ ఆమెను చెంప దెబ్బ కొట్టాడు. బాధితురాలు తన సోదరుడిని పిలిచింది. వారిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగి చివరికి అతనిని కూడా పంకజ్ కొట్టాడు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు పంకజ్‌పై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీస్ లు అతనిని కోర్ట్ లో హాజరు పరిచారు. ఈ కేసు పై అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి పూనమ్ ఆర్ జోషీ ఈ తీర్పు చెప్పారు. పంకజ్‌కు రెండేళ్ళ జైలు శిక్షతోపాటు రూ.21,000 జరిమానా కూడా విధించారు. అయితే చివరకు పంకజ్‌కు బెయిలు మంజూరైంది…