200 కోట్లు మంజూరీ.. న‌ల్ల‌మోతు విశిష్ఠ‌తే!

Sunday, April 15th, 2018, 10:40:18 PM IST


ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా ఎమ్మెల్యే ప‌నిమంతుడు అని నిరూపించుకుంటే, ఆటోమెటిగ్గా పైస్థాయి నుంచి నిధులొస్తాయి. అలా వ‌చ్చిన వాటిని స‌ద్వినియోగం చేస్తే, మ‌రింత‌గా ప్ర‌భుత్వ సాయం ఉంటుంది. ప్ర‌స్తుతం మిరియాల‌గూడ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, తేరాస నేత‌ న‌ల్ల‌మోతు భాస్క‌ర్‌రావు చేస్తున్న ప‌నుల‌కు హ‌ర్షించి, నియోజ‌క‌వ‌ర్గం మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ 200 కోట్లు మంజూరు చేయ‌డం స‌ర్వ‌త్రా హ‌ర్షానికి కార‌ణ‌మైంది. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ప్ర‌స్తుతం ఈ విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సాగు-తాగు నీటి ప్రాజెక్టులు స‌హా న‌ల్ల‌మోతు ప‌నిత‌నం చ‌ర్చ‌కొచ్చింది.

ఏప్రిల్ 5న మిర్యాలగూడలో జరిగిన జనహిత ప్రగతి బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజల ఉత్సాహం, స్పందన చూసి మంత్ర‌ముగ్దుల‌వ్వ‌డ‌మే గాకుండా.. ప్ర‌జ‌ల్లో ఇంతటి ఆదరణ, స్పందన తన జీవితంలో చూడలేదని కొనియాడారు. వేదిక‌పై కేటీఆర్‌ మాట్లాడుతూ, -“ఎంఎల్ఏ నల్లమోతు భాస్కర్ రావు గారు మిర్యాలగూడ అభివృద్దే ద్యేయంగా అహర్నిశలు పని చేస్తున్నారు. అది ప్ర‌జ‌లు గుర్తించి ఆద‌రిస్తున్నారు. ఇలానే మ‌రిన్ని మంచి ప‌నులు చేయాల‌ని“ అన్నారు. నల్లమోతు అడ‌గ్గానే, మునిసిపాలిటిశాఖ మాత్యులు కేటీఆర్ రూ.200కోట్లు మంజూరు చేయటం పట్ల మిర్యాలగూడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.