2008 నుంచి..IPL మ్యాచుల్లో అత్యధిక ధర పలికిన క్రికెటర్లు వీరే..!

Thursday, December 20th, 2018, 10:45:43 PM IST

భారతదేశంలో వేసవి కాలం వచ్చిందంటే ఒక నెలన్నర రోజులు క్రికెట్ అభిమానులకు రోజుకొక పండుగ వచ్చినట్టే అని చెప్పాలి.ఎందుకంటే 2008 లో “ఇండియన్ ప్రీమియర్ లీగ్”(IPL) అనే మ్యాచులు మొదలయ్యాయి.ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ సీజన్ కు భారత క్రికెట్ అభిమానులు బ్రహ్మరధం పట్టారు.ప్రపంచ జట్లలోని ఆటగాళ్లు అంతా ఒకే జట్టులో కనిపించడం,మన భారత జట్టు ప్లేయర్లే ఒక్కో జట్టుకి సారధిగా భాద్యతలు చేప్పట్టడం వంటి అంశాలు క్రికెట్ అభిమానుల మదిని దోచుకున్నాయి.అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మ్యాచులకు గాను ఆయా జట్ల యజమానులు వారికి టీం కి కావాల్సిన ప్లేయర్ల మీద కోట్లు కుమ్మరించి సొంతం చేసుకుంటారు.2008 నుంచి 2019 వరకు జరిగిన మ్యాచుల్లో అత్యధిక ధర పలికినటువంటి ప్లేయర్ల యొక్క జాబితా ఈ క్రింది విధంగా ఉంది.ఒక సారి మీరు కూడా చూసెయ్యండి.

2008 – మహేంద్ర సింగ్ ధోని – చెన్నై సూపర్ కింగ్స్ – 5.85 కోట్లు

2009 – ఫ్లింటాఫ్ మరియు పీటర్సన్ – చెన్నై,బెంగళూరు – 7.60 కోట్లు

2010 – బాండ్ మరియు పోలార్డ్ – కోల్ కత్తా,ముంబై – 3.45 కోట్లు

2011 – గౌతమ్ గంభీర్ – కోల్ కత్తా నైట్ రైడర్స్ – 10.8 కోట్లు

2012 – రవింద్ర జడేజా – చెన్నై – 10.4 కోట్లు

2013 – గ్లెన్ మాక్స్ వెల్ – ముంబై ఇండియన్స్ – 5.40 కోట్లు

2014 – యువరాజ్ సింగ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 14.0 కోట్లు

2015 – యువరాజ్ సింగ్ – ఢిల్లీ డేర్ డెవిల్స్ – 15.9 కోట్లు

2016 – షేన్ వాట్సన్ – బెంగళూరు – 9.38 కోట్లు

2017 – బెన్ స్టోక్స్ – పూణే – 14.7 కోట్లు

2018 – బెన్ స్టోక్స్ – రాజస్థాన్ రాయల్స్ – 12.4 కోట్లు

2019 – ఉనాద్కత్ మరియు చక్రవర్తి – రాజస్థాన్,పంజాబ్ – 8.4 కోట్లు.