చంద్రబాబుకు కోర్టు నోటీసులు అందేలా ఉన్నాయా?

Thursday, September 13th, 2018, 12:50:44 PM IST

తెలంగాణాలో ఓ వైపు కాంగ్రెస్ నేతలు కేసుల ఉచ్చులో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు దేశం పార్టీ నేతలకు సంబందించిన కేసుల చిట్టా కూడా తెరవబడనుందనే టాక్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. బాబ్లీ డ్యామ్ సందర్శనకు సంబందించిన వివాదం మరోసారి కోర్టులో విచారణ జరగనుందని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

2010 లోమహారాష్ట్రలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బాబ్లీ డ్యామ్ ను చంద్రబాబు సందర్శించడానికి వెళ్లారు. ఆయనతో పాటు పలువురు తెలుగు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వెళ్లారు. అయితే మొదట పోలీసులు డ్యామ్ సందర్శనకు అనుమతిస్తామని చెప్పి ఆ తరువాత ఊహించని విధంగా పోలీసులు చంద్రబాబును టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో వందల మంది టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు లాటి ఛార్జి చేసి 76 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. బాబ్లీ డ్యామ్ వద్ద ఆందోళనలు జరిపినందు వల్లే అప్పట్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ కేసులో భాగంగానే త్వరలోనే కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments