బాబు ఎఫెక్ట్‌ : ఏయూలో 2014 క్లాస్‌-4 జాబ్స్ పెండింగ్‌లో!

Tuesday, February 13th, 2018, 01:18:18 AM IST

బాబు వ‌స్తేనే జాబు! అన్నారు. కానీ నాలుగేళ్ల పాల‌నలో అస‌లు ఉద్యోగాలు అన్న‌వే లేవు. ఇదీ నిరుద్యోగుల నిరాశావాదం. ఇటు చంద్ర‌బాబు, అటు కేసీఆర్ దొందూ దొందే ఉద్యోగాలు ఇవ్వ‌డంలో అన్న టాక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఏపీ వ‌ర‌కూ డీఎస్సీ వేసి జాబ్స్ తీస్తున్నామ‌ని హ‌డావుడి చేస్తున్నారు. అటువైపు కేసీఆర్ సేమ్ టు సేమ్‌. అదంతా స‌రేకానీ… ఏపీలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ ఆంధ్రా యూనివ‌ర్శిటీ లో 2014 క్లాస్ 4 ఉద్యోగాలు ఇప్ప‌టికీ ఖాళీగా మిగిలిపోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

సెక్యూరిటీ గార్డ్‌, శానిట‌రీ జాబ్స్‌, మెస్‌, హాస్ట‌ల్స్‌లో బోయ్స్‌, గార్డెన‌ర్స్‌..ఇలా చిన్నా చిత‌కా ఉద్యోగాల్ని భ‌ర్తీ చేయాల్సి ఉండ‌గా.. అవేవీ ఫిల‌ప్ కాలేదని.. అన్ని విభాగాల్లో ఆల్ట‌ర్నేట్ డెయిలీ వేజెస్ ఉద్యోగులతో స‌రిపుచ్చార‌ని తెలుస్తోంది. అలాగే 114 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల ఎంపిక సాగాల్సి ఉండ‌గా.. ప‌రీక్ష పెట్టి వివాదాల వ‌ల్ల రిక్రూట్మెంట్‌ ఆపేశారు. ఇలా మిగిలిపోయిన ఖాళీల‌న్నీ తాత్కాలిక ఉద్యోగుల‌తోనే ఫిల్ చేసి మ‌మ అనిపించేస్తున్నారుట‌. ఓవైపు ఏపీ రాజ‌ధాని నిర్మాణంపై చూపించే శ్ర‌ద్ధ రిక్రూట్‌మెంట్‌పై ఏమాత్రం చూపించ‌డం లేద‌ని నిరుద్యోగ యువ‌త తీవ్ర నిరాశ‌లో ఉంది. చంద్ర‌బాబు పాల‌న మొద‌లైన‌ప్ప‌టినుంచి అస‌లు రెగ్యుల‌ర్ రిక్రూట్‌మెంట్ అన్న‌దే లేదు. దీంతో నిరుద్యోగులంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. బాబు హ‌యాంలోనే ఏపీలో 76వేల మంది ఎన్ఎంఆర్‌ల‌ను విధుల నుంచి తొల‌గించమ‌ని ఆదేశించాక పెద్ద గొడ‌వ‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం బాబు వైఖ‌రి వ‌ల్ల ఇప్ప‌టికీ నిరుద్యోగం ఏపీలో రుద్ర తాండ‌వం చేస్తోంద‌న్న రిపోర్ట్ ఉంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై దీని ప్ర‌భావం త‌ప్ప‌నిసరి అన్న ప్ర‌చారం సాగుతోంది.