2016-2017 రైల్వేబడ్జెట్ వివరాలు

Thursday, February 25th, 2016, 01:27:52 PM IST


రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016- 2017 కు గాను రైల్వే బడ్జెట్ ను ఈరోజు గురువారం లోక్ సభలో ప్రవేశపెడుతున్నారు. రైల్వేఆధునీకరణ, ప్రైవేటీకరణ, ఉత్తమ పని తీరు, సమర్థత వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ కలలను సాకారం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందని కూడా తెలిపారు. సామాన్యులకు అత్యంత ప్రయోజనకరంగా, సౌకర్యవంతంగా కూడా ఈ బడ్జెట్ ఉండబోతోందని తెలిపారు. ఆయన ప్రవేశపెడుతున్న బడ్జెట్ లోని విశేషాలు..

* ప్రణాళిక వ్యయం 1.21 లక్షల కోట్లు
* 2016- 17 ఆదాయ లక్ష్యం 1.81 లక్షల కోట్లు
* ప్రతి ట్రైన్లలో వృద్దులకు 120 లోయర్ బెర్తులు
* 311 ప్రధాన రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు
* టికెట్ రిజర్వేషన్లో 33% మహిళలకు కేటాయింపు
* పెండింగ్ ప్రాజెక్టులన్నీ 3 ఏళ్లలో పూర్తి
* 100 రైళ్ళలో బయో టాయిలెట్స్
* నాగ పూర్ – విజయవాడ మధ్య ట్రేడ్ కారిడార్
* 408 స్టేషన్లలో ఈ- క్యాటరింగ్ సౌకర్యం
* చిన్నారుల కోసం పాలు, వేడి నీళ్ళు, ఆహరం అందుబాటులో ఉంచడం
* గత ప్రాజెక్టులోని 130 పనులు ఈసారి పూర్తి చేయడం
* 1350 రైల్వే క్రాసింగులలో ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు
* 130 కి.మీల వేగంతో నడిచే తేజాస్ రైళ్ళ ఏర్పాటు
* ప్యాసింజర్ రైళ్ళ సగటు వేగం 60 కి.మీ గంటకు, ఎక్స్ ప్రెస్ రైళ్ళ వేగం 80కి.మీ లు గంటకు పెంచడం
* మహిళల భద్రత కోసం ప్రత్యేక కాల్ సెంటర్ల ఏర్పాటు
* బుకింగ్ సమయంలోనే ప్రయాణీకులకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం
* రైల్వే కూలీలు ఇకపై సహాయక్ లుగా పిలువబడతారు
* SMS ద్వారా టాయిలెట్లను శుభ్రం చేసే విధానం
* 139 లైన్ల ద్వారా క్యాన్సిలేషన్ సౌకర్యాన్ని కల్పిస్తాం
* విదేశీ కార్దులతోనో బుకింగ్ సౌకర్యం
* జర్నలిస్టులకి ప్రత్యేక బుకింగ్ సౌకర్యం