ఐపీఎల్ లో గెలిస్తే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Sunday, April 8th, 2018, 05:07:58 AM IST

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న 2018 ఐపీఎల్ 11వ సీజన్ వేడుక మొదలైంది. ఎవరి సత్తా ఏమిటో ఈ రోజు నుంచి గ్రౌండ్ లో కనిపిస్తుంది. అయితే చివరగా ఎవరు గెలుస్తారో చెప్పడం ఈ సారి చాలా కష్టం. ఎందుకంటే ఐపీఎల్ జట్లు చాలా బలంగా మారాయి. ఒక జట్టు వీక్ గా ఉంది అని చెప్పడం కొంచెం కష్టమే. ఇకపోతే ఫైనల్ మ్యాచ్ లో ట్రోపిని అందుకున్న జట్టుకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?.

ట్రోపి గెలిచినా జట్టుకు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తారు. ఇక ఫైనల్ లో ఒడిన రన్నరప్ టీమ్ కు 12.5 కోట్ల రూపాయల నగదు బహుమానాన్ని ఇస్తారు. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో అలాగే నాలుగవ స్థానంలో ఉన్న జట్టుకు 8.75 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించారు. ఈ కోట్ల నజరానాను ఎవరు అందుకుంటారో అని ఇప్పటికే అందరిలో ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ 11వ సీజన్ పై ప్రపంచంలోని ఇతర క్రీడా అభిమానులు కూడా చాలానే ఎదురుచూస్తున్నారు. దాదాపు అన్ని ప్రముఖ దేశాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు ప్రసారం కానున్నాయి.