2019 బిగ్ ఏపీ ఫైట్ : ల‌గ‌డ‌పాటి స‌ర్వే అవుట్.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు..!

Tuesday, November 20th, 2018, 04:15:35 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కింది. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో జ‌రుగ‌నుండ‌గా.. ఒక‌వైపు టీఆర్ఎస్ మ‌రోవైపు మ‌హాకూట‌మి మ‌ధ్య పోరు ఆశ‌క్తిక‌రంగా మారింది. ఇక ఏపీలో మాత్రం వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి నుండి అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ నేప‌ధ్యంలో అనేక స‌ర్వేలు తెర‌పైకి వ‌చ్చి హ‌డావుడి చేస్తున్నాయి. అయితే తాజాగా వ‌చ్చిన స‌ర్వే రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఏపీ ఆక్టోప‌స్‌గా పేరుగాంచిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేల పై తెలుగు ప్ర‌జ‌ల‌కి ఓ న‌మ్మ‌కం ఉంది. దీంతో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌ల‌వ‌గానే ల‌గ‌డ‌పాటి స‌ర్వేలు తెర‌పైకి వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేస్తుంటాయి. ఇక ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ల‌గ‌డ‌పాటికి కున్న సాన్నిహిత్యం గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఇటీవ‌ల జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన త‌ర్వాత ప్ర‌జ‌ల నాడి ఎలా ఉందో తెలుసుకోవ‌డానికి చంద్ర‌బాబు ల‌గ‌డ‌పాటితో సీక్రెట్‌గా స‌ర్వే చేయించుకున్నాడ‌ని స‌మాచారం. అయితే ఆ స‌ర్వే రిజ‌ల్ట్స్ చూసి చంద్ర‌బాబుకు మైండ్ బ్లాక్ అయ్యింద‌ని స‌మాచారం.

జ‌గ‌న్ పై దాడి జరిగిన త‌ర్వాత వైసీపీ మైలేజ్ విప‌రీతంగా పెరిగింద‌ని, టీడీపీ ప‌రువు పూర్తిగా పోయింద‌ని ఆ స‌ర్వేలో తేలింద‌ట‌. జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన త‌ర్వాత టీడీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు టీడీపీ కొంప‌ముంచాయ‌ని, మ‌రోవైపు ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో చంద్ర‌బాబు మైత్రిని ఏపీ ప్ర‌జ‌లు స‌హించ‌లేక పోతున్నార‌ని తెలుస్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని, సీట్లు కూడా చాలా త‌క్కువ వ‌స్తాయ‌ని, కొంత‌మంది నేత‌లకైతే డిపాజిట్లు కూడా రావ‌ని ఆ సర్వే తేల్చేసింద‌ట‌.

ఇక మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ కూడా పూర్తి స్థాయిలో బ‌రిలోకి దిగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌న‌సేన వ‌ల్ల‌ వైసీపీకి కానీ టీడీపీ కాని గ‌ట్టి దెబ్బ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు. ఈ నేప‌ధ్యంలో తాజాగా వ‌చ్చిన స‌ర్వేలో ఏం తేలిందంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు మూడు జిల్లాల్లోనే ప‌రిమ‌తం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఓటు బ్యాంక్‌ను చీల్చిన జ‌న‌సేన ఈసారి టీడీపీ ఓటుబ్యాంక్‌ను చీల్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఈ క్ర‌మంలో జ‌న‌సేన సింగిల్ డిజిట్ సీట్ల‌కే ప‌రిమితం కానుంద‌ని ల‌గ‌డ‌పాటి స‌ర్వే తేల్చేసింది.

ఇక వ‌చ్చే గ‌త ఎన్నిక‌ల్లో కొద్దిలో అధికారాన్ని కోల్పోయి ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న వైసీపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా పుంజుకోనుంద‌ని, జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో వైసీపీ మైలేజి విప‌రీతంగా పెరిగిపోయింద‌ని, త‌న పై క‌త్తితో దాడి జ‌రిగినా హుందాగా ప్ర‌వ‌ర్తించిన జ‌గ‌న్ గ‌తంలోలాగ‌ దూకుడుగా లేడ‌ని, రాజ‌కీయ ప‌రివ‌ర్త‌న బాగా సాధించాడ‌ని, ఇక ఆయ‌న ప్ర‌కటించిన న‌వ‌ర‌త్నాలుతో ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతాయ‌ని ఏపీ ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని ఆ స‌ర్వే ద్వారా తేలింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా వైసీపీకే ఉన్నాయ‌ని.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేల ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో వెళితే గెలుపు వైసీపీదే అని ల‌గ‌డ‌పాటి స‌ర్వే తేల్చేసింది.

ఇంక కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే ఏపీలో కూడా టీడీపీతో చేతులుక‌లిపే అవ‌కాశాలు ఉన్నాయి క‌నుక ఒక్క‌సీటు గెలిచినా వండ‌రే అని, రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించిన కాంగ్రెస్ పై ఏపీ ప్ర‌జ‌లు మ‌రోసారి రివేంజ్ తీర్చుకోనున్నార‌ని ఆ స‌ర్వే తేల్చేసింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప‌రిస్థితి కూడా దారుణంగా ఉంద‌ని, ఏపీలో మోదీ హ‌వా ప‌నిచేయ‌ద‌ని ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో బీజేపీ పై కూడా ఏపీ ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నార‌ని, దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కషాయం పార్టీకి కూడా డిపాజిల్లు వ‌చ్చే అవ‌కాశ‌లు లేవ‌ని ల‌గ‌డ‌పాటి స‌ర్వే తేల్చేసింది. మ‌రి ఈ స‌ర్వే రిపోర్ట్స్ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి రెండు మూడు వారాల‌కు పైగానే అవుతోంద‌ట‌. అయితే త‌న‌కు అనుకూలంగా రాక‌పోవ‌డంతో దాన్ని ప‌క్క‌న పెట్టేశార‌ట‌. అయితే తాజాగా టీడీపీ శ్రేణుల నుండి ఈ స‌ర్వే రిపోర్టు లీక్ అవ‌డంతో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.