2019 బిగ్ ఫైట్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ అక్క‌డి నుండే..?

Tuesday, November 20th, 2018, 12:48:45 PM IST

ఏప‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌ను వేగ‌వంతం చేశారు. ఇప్పటికే జ‌న‌సేన నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌వ‌న్ త‌న మాట‌ల తూటాలు పేలుత‌స్ఊ.. ఒక‌వైపు అధికార టీడీపీకి,. మ‌రోవైపు ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష వైసీపీ పై విమ‌ర్శ‌ల వాన కురిపిస్తున్నారు. అయితే ఇక్క‌డు ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ ఏ జిల్లాకు వెళ్ళినా, అక్క‌డ ఏదో ఒక నియోజ‌క వ‌ర్గం నుండి పోటీ చేస్తాన‌ని చెబుతూ వ‌స్తున్నాడు. దీంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్కడినుండి పోటీ చేస్తాడో అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

అయితే తాజాగా ప‌వ‌న్ పోటీ చేసే స్థానం పై తాజాగా క్లారిటీ ఇచ్చారు..ఆ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు ముత్తా గోపాలకృష్ణ. తాజాగా కాకినాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాలకృష్ణ మాట్లాడుతూ… వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కాకినాడ సిటీ లేదా కాకినాడ రూర‌ల్, లేదా పిఠాపురం నుండి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఇక రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న‌ పవన్ తూర్పు గోదావ‌రిజిల్లాలో పోటీ చేయడం గర్వకారణమ‌ని… దీంతో కార్యకర్తలు, జనసైనికులు, అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప‌వ‌న్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మ‌రి ఎప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాలు మార్చుకునే ప‌వ‌న్ ఫైన‌ల్‌గా గోపాల‌కృష్ణ చెప్పిన మూడుస్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి బ‌రిలోకి దిగుతాడో.. లేక ఎన్నిక‌ల నాటికి గ‌తంలో చెప్పిన‌ట్టు అనంత‌పురం, ఏలూరు నుండి పోటీ చేస్తాడో చూడాలి.