2019 ఎల‌క్ష‌న్ బాబుకు పెను స‌వాల్‌!!

Friday, January 11th, 2019, 10:20:31 AM IST

కాలం క‌లిసి రాన‌ప్పుడు తాడే పామై క‌రుస్తుందంట‌. చంద్ర‌బాబు విష‌యంలోనూ అదే జ‌ర‌గ‌బోతోందా?..ఈ ద‌ఫా చంద్ర‌బాబు చుక్క‌లు చూడ‌క త‌ప్ప‌దా?. ప్ర‌తిసారీ ఎన్నిక‌ల వేళ ఎవ‌రో ఒక‌రి అండ‌తో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే చంద్ర‌బాబుకు 2019 ఎన్నిక‌లు స‌వాల్‌గా మారాయా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు అవున‌నే చెబుతున్నాయి. త‌న వెంట న‌డుస్తార‌ని భావించిన ఒక్కో నేత బాబు తీరు న‌చ్చ‌క త‌మ దారి తాము చూసుకుంటూ షాకుల‌మీద షాకులిస్తున్నారు. దీనికితోడు స‌ర్వేలు కూడా భ‌యంక‌ర‌మైన నిజాల‌ని వెల్ల‌డిస్తుండ‌టంతో బాబు ప‌త‌నం మొద‌లైంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

రానున్న పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో ఒక వేళ టీడీపీ, కాంగ్రెస్ క‌లిసి పోటీ చేసినా వైసీపీకి 19 స్థానాల్లో విజ‌యం సాధించ‌డం ఖాయం అని జాతీయ స‌ర్వేలు తేల్చి చెప్ప‌డం బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ‌ట‌. దీనికి తోడు గ‌త కొన్నేళ్లుగా టీడీపీకి కంచుకోట‌గా వున్న శ్రీ‌కాకుళంలో ఈ ద‌ఫా వైకాపా జెండ ఎగ‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో శ్రీ‌కాకుళం ఎంపీ స్థానంపై వైసీపీలో గ‌ట్టి పోటీ నెల‌కొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడేప‌ల్లి స‌త్య‌వ‌తి కుమారుడు మాజీ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ బోడేప‌ల్లి ర‌మేష్‌కుమార్ వైసీపీలో చేర‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. శ్రీ‌కాకుళంలో మంచి ప‌ట్టున్న వీరి కుటుంబం ఎంపీ స్థానం ఆశిస్తూ ఇటీవ‌లే విజ‌య్‌సాయిరెడ్డిని క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.