ఆస్కార్ 2019కి రాజీ, ప‌ద్మావ‌త్ 3డి?

Saturday, September 22nd, 2018, 11:50:48 AM IST

2019 ఆస్కార్ బ‌రిలో ప్రాంతీయ కేట‌గిరీ నుంచి నిలిచే ఇండియా చిత్రాలేవి? ప‌్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. బాలీవుడ్ స‌హా అన్ని ప్రాంతీయ భాష‌ల నుంచి ఆస్కార్ నామినేష‌న్ల‌కు ప్ర‌తియేటా సినిమాలు వెళుతున్నాయి. అయితే ఫైన‌ల్‌గా వీటి నుంచి ఏదో ఒక సినిమాని ఫైన‌ల్‌గా ఎంపిక చేసి ఆస్కార్‌కి పంపిస్తున్నారు. గ‌త ఏడాది రాజ్ కుమార్ రావ్ న్యూట‌న్ చిత్రం ఆస్కార్ బ‌రిలోకి వెళ్లినా అవార్డులు గెలుచుకోలేక‌పోయింది. ఆ సినిమాపై కాపీ క్యాట్ అంటూ దుష్ప్ర‌చారం సాగ‌డంతో ఆ ప్ర‌భావం అవార్డుల క‌మీటీపైనా ప‌డిందన్న ప్ర‌చారం సాగింది.

ఈసారి నామినేష‌న్ల రేసులో దీపిక‌- భ‌న్సాలీల ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ప‌ద్మావ‌త్ 3డి, ఆలియాభ‌ట్ – విక్కీ కౌశ‌ల్ జంట‌గా న‌టించిన రాజీ చిత్రాలు ప్ర‌ముఖంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. వీటితో పాటే వ‌రుణ్ ధావ‌న్‌- బానిట సంధుల `అక్టోబ‌ర్‌`, నందితాదాస్- న‌వాజుద్దీన్ సిద్ధిఖిల `మాంటో` నామినేష‌న్ల రేసులో ఉన్నాయి. అక్ష‌య్ – ప్యాడ్ మ్యాన్‌, అమితాబ్-రిషీజీ- 102 నాటౌట్‌, ల‌వ్ సానియా చిత్రాలు నామినీ జాబితాలో ఉన్నాయి. మ‌రాఠా నుంచి బోగ్డ‌, న్యూడ్, గులాబ్ జామ్, గుజ‌రాతీ నుంచి రేవ‌, బెస్ట్ ఆఫ్ ల‌క్ లాలు, త‌మిళం నుంచి టు లెట్‌, కోల‌మావు కోకిల‌, అస్సామీ నుంచి విలేజ్ రాక్‌స్టార్ చిత్రాలు ఆస్కార్ నామినేష‌న్ల బ‌రిలోకి వెళుతున్నాయ‌ని తెల‌స్తోంది. ఫైన‌ల్‌గా ఈరోజు సాయంత్రానికి ఆస్కార్‌- ఇండియా నామినీ జాబితా వెలువ‌డుతుందిట‌. ముంబై ఐఎంపీపీఏ హౌస్ అనే చోట 2019 లిస్టు త‌యార‌వుతోందిట‌. ఇక‌పోతే ఈసారి జాబితాలో మ‌రాఠా, గుజ‌రాతీ, త‌మిళ చిత్రాలు ఉన్నాయి.