21 లక్షల ఓట్లను ఈ ప్రభుత్వం తీసేసింది..పవన్ కళ్యాణ్!

Monday, September 24th, 2018, 02:45:54 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణ పనుల్లో మళ్ళీ జనసేనాని మమేకం కానున్నారు, నెల్లూరులోని రొట్టెల పండుగ నిమిత్తం పవన్ కళ్యాణ్ అక్కడికి హాజరు అయ్యిన సంగతి తెలిసినదే,అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పండుగ హాజరు అయిన అనంతరం పవన్ కళ్యాణ్ గారి చిన్న నాటి స్నేహితులు ఊహించని బహుమతిని అందించారు వారి యొక్క చిన్ననాటి ఉపాధ్యాయులతో మరియు అక్కడి జనసేన కార్యకర్తలతో ఒక సభను ఏర్పాటు చేశారు.

ఆ సభలో భాగంగా ముందు పవన్ కళ్యాణ్ వారి గురువులను మళ్లీ ఇన్నాళ్లకు చూసినందుకు వారికి పాదాభివందనం చేసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత 18 ఏళ్ళు నిండిన యువతను ఉద్దేశించి ప్రతీ ఒక్కరు తమ ఓటుని రిజిస్టర్ చేయించుకోవాలని కోరారు,మనకి ఓటు హక్కు ఉన్నప్పుడు మన నాయకులను ప్రశ్నించే హక్కు కలిగి ఉంటామని పేర్కొన్నారు,అంతే కాకుండా ఈ అధికార ప్రభుత్వాలు వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించేస్తుంటారని,అందులో భాగంగానే జనసేనకు మద్దతుగా ఉన్నారన్న నెపంతో వారు 21 లక్షల ఓట్లను అధికార ప్రభుత్వం వారు తొలగిచేశారని తెలిపారు,అందువల్ల ప్రతీ ఒక్కరూ వారి ఓటు వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు వారి ఓటు ఉన్నదో లేదు సరి చూసుకోవాలని సూచించారు.