పవన్ ఓట్ల లెక్క 21 లక్షలు !

Friday, October 26th, 2018, 12:10:15 PM IST

ఎన్నికలు వస్తున్నాయంటే ఓటర్ల జాబితాలో పనికా మార్పులు చోటు చేసుకోవడం సహజం. కొత్తగా ఓటును నమోదు చేసుకునే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. ఓటు హక్కుని తొలగించుకునేవాళ్ళు కొంతమందే ఉంటారు. బోగస్ ఓట్లని అధికారులు కొన్ని ఓట్లను తొలగిస్తుంటారు. మొత్తానికి అన్ని లెక్కలను బేరీజు వేసుకుంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా కొద్దిగా ఎక్కువో, కొద్దిగా తక్కువో ఉండాలి. ఖచ్చితంగా చెప్పాలంటే లెక్క నాలుగంకెల సంఖ్యలోనే ఉంటుంది.

కానీ జనసేన అధ్యక్షుడు పవన్ చెబుతున్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ తేడా లక్షల్లో కనిపిస్తోంది. ఒక్కో జిలాల్లో 2015 నాటి ఓటర్ల సంఖ్యకు ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్యకు 2 లక్షలు, 3 లక్షలు తేడా కనిపిస్తోంది. ఈ తేడా పెరిగిన ఓట్లైతే పర్వాలేదు కానీ తొలగింపబడిన ఓట్లు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఈ దఫా 358201 ఓట్లు, కృష్ణాలో 323664 ఓట్లు, కడపలో 303408, విశాఖలో 279118, నెల్లూరులో 199686 ఓట్లు, చిత్తూరులో 165905 ఓట్లను అధికారులు తొలగించారు. కేవలం ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే క్రితంసారి కన్నా 2866 ఓట్లు అధికంగా కనిపిస్తున్నాయి.

మొత్తంగా అన్ని జిల్లాల నుండి తొలగించిన ఓట్లను చూస్తే 2159684 గా ఉన్నాయి. ఈ లెక్క తక్కువేం కాదు. చాలా పెద్దది. అధికారాన్ని డిసైడ్ చేయగల రీతిలో ఈ సంఖ్య ఉంది. ఈ తొలగింపు సక్రమమైందో లేదో తేల్చడం కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ పోర్టల్ లోకి వెళ్లి తమ ఓట్లు ఉన్నాయో లేదో పరిశీలించుకుని ఒకవేళ లేకపోతే ఈ నెల 31వ తేదీలోపు నమోదు చేసుకోవడం మంచిది.

  •  
  •  
  •  
  •  

Comments