వంతెన పై పట్టాలు తప్పిన రైలు..22 బోగీలు నదిలోకి..!

Monday, February 13th, 2017, 04:37:28 PM IST


అమెరికాలో కాలిఫోర్నియాలో ఓ రైలు నది వంతెన పై పట్టాలు తప్పింది. దీనితో 22 రెండు బోగీలు నదిలోపడిపోయాయి. అదృష్టవ శాత్తు అది గూడ్స్ రైలు కావడంతో ప్రాణహాని జరగలేదు. ప్రమాద సమయం లో రైలు లో ముగ్గురే ఉన్నప్పటికీ ఎవరికీ ఎటువంటిప్రమాదం జరగలేదు. కుసుమన్స్ నది వంతెన పై ప్రయాణిస్తున్న రైలు ఈ ప్రమాదానికి గురైంది. ఇప్పటికే ఆ నది వరదలతో ఉప్పొంగుతోంది. దీనితో రైలు లోని 32 బోగీల్లో 22 బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో కొన్ని నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది.

అయితే బోగీల్లో ప్రమాదకర వస్తువులు లేవని, ఆహార ప్రదార్థాలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన రైలు యాజమాన్యం క్షమాపణలు తెలిపింది.