24 కిస్సెస్ ర‌చ్చ.. జ‌ర్న‌లిస్ట్ సూటి ప్ర‌శ్న‌.. చిందులేస్తూ వెళ్ళిపోయిన‌ హెబ్బా ప‌టేల్..!

Monday, November 19th, 2018, 01:42:04 PM IST

టాలీవుడ్‌లో ఈమ‌ధ్య వ‌స్తున్న చిత్రాల్లో రొమాన్స్ హ‌ద్దులు దాటుతోంది. అర్జున్ రెడ్డి చిత్రంలో లిప్‌లాక్‌లు మ‌ర్చిపోక ముందే.. ఆర్ఎక్స్‌100 వ‌చ్చి ఘ‌టు రొమాన్స్, ముద్దుల‌తో ముంచెత్తి కుర్ర‌కారును ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇప్పుడు తాజాగా 24 కిస్సెస్ అంటూ మ‌రో హాట్ రొమాంటిక్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన 24 కిస్సెస్ టీజ‌ర్, ట్రైల‌ర్‌ల‌లో చూపించిన సీన్లు చాలా అస‌భ్య‌క‌రంగా ఉన్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. తాజ‌గా ఓ ప్ర‌ముఖ చాన‌ల్ 24 కిస్సెస్ చిత్ర చూనిట్‌తో చ‌ర్చా కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది.

ఇక చ‌ర్చ‌లో భాగంగా ఓ మీడియా జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్నిస్తూ.. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే మీ..టూ అంటూ పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేస్తున్న నేప‌ధ్యంలో.. లిప్‌లాక్ సీన్లు, బాత్‌రూమ్ సీన్లు, బెడ్‌రూమ్ సీన్లు చాలా వ‌ల్గ‌ర్‌గా చూపిస్తూ.. ఇలా యువ‌త‌ను రెచ్చ‌గొట్టే చిత్రాలు ఎందుకు తీస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. దీంతో వెంట‌నే చిత్ర యూనిట్ స్పందిస్తూ.. ఈ చిత్రంలో యూత్‌ని రెచ్చ‌గొట్టే విధంగా సీన్లు ఏం లేవ‌ని.. ఒక అమ్మాయి, అబ్బాయి నాలుగు గోడల మధ్య క‌లిసిన‌ప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చూపించామ‌ని చెప్పారు. ఇక ఈ విష‌యం పై వెంట‌నే మైక్ తీసుకుని స్పందించిన హెబ్బా ప‌టేల్.. ఈ చిత్రంలో ముద్ద‌లు త‌ప్పా.. మీకు ఇంకేమి క‌నిపించ‌లేదా అంటూ మీడియాలో చిందులు తొక్కుతూ.. చ‌ర్చ మ‌ధ్య‌లోనే అక్క‌డి నుండి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. దీంతో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.