తెలంగాణ‌లో ఓట్ల గ‌ల్లంతు కోట్ల‌లోనే!

Tuesday, September 11th, 2018, 04:00:10 PM IST

తెలంగాణ‌లో ఎన్నిక‌లకు స‌మ‌ర‌స‌న్నాహ‌కం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముంద‌స్తు హ‌డావుడి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. ఆ క్ర‌మంలోనే తెలంగాణ‌లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎందరు ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకుంటారు? అంటూ ఆస‌క్తిక‌రంగా లెక్క‌లు తీయ‌డం మొద‌లైంది. ఇంత‌కీ తెలంగాణ‌లో ఓట్లు ఎన్ని? అంటే ఇదిగో ఇదే స‌మాధానం.

తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైంది. ఈ ముసాయిదా జాబితా ప్రకారం ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 2,61,36,776. అంటే సుమారు 2.7 కోట్ల ఓట్లు మాత్ర‌మే ఉన్నాయి. అయితే 2018 మార్చిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ఇది. దానికి ఇప్పుడు ఎన్నికల సంఘం స‌వ‌ర‌ణ చేప‌ట్ట‌నుంది. అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు 15 రోజుల పాటు గడువు ఇచ్చారు. ఈనెల 25 వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం ఉంటుంది. వచ్చే నెల 8 వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు చేస్తోంది. అంటే ఇప్పుడున్న ఓట్ల‌లో ఊడేవి ఎన్ని? ఉండేవి ఎన్ని? అన్న‌ది అప్ప‌టికి తేల్తుంది. ఇక ఎన్ని ఓట్లు యాడ‌వుతాయో చూడాలి. మ‌రోవైపు తెలంగాణ‌లో జ‌నాభా 2.7 కోట్లు మాత్ర‌మేనా? 4కోట్ల మంది జ‌నం ఉన్నార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. అంటే కోట్ల‌లోనే ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని సందేహించాలా?

  •  
  •  
  •  
  •  

Comments