రోహింగ్యా ముస్లిమ్స్… 28 హిందువులని కిరాతకంగా!

Monday, September 25th, 2017, 10:05:23 AM IST

ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం రోహింగ్యా ముస్లిమ్స్ గురించి ఒక వైపు మాత్రమె చూస్తుంది. ప్రపంచ దేశాలు అక్కడి రోహింగ్యా ముస్లిమ్స్ కి ఏమో అయిపోయినట్లు గగ్గోలు పెడుతుంది. మరో వైపు భారత్ లో కూడా అక్కడి రోహింగ్యా ముస్లిమ్స్ కి ఆశ్రయం కల్పించాలని ఇక్కడి ముస్లిమ్స్ కమ్యూనిటీతో పాటు షో కాల్డ్ కమ్యునిస్ట్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడి ఆర్మీ అరాచాకాలని ఆపాలని డిమాండ్ చేస్తూ, వారికి మద్దతుగా భారతలో చాలా చోట్ల ప్రజలు రోడ్లు మీదకి వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎవరి మాటకి విలువ ఇవ్వలేదు. రోహింగ్యా ముస్లిమ్స్ ని దేశంలోకి రానిచ్చేది లేదని తెగేసి చెప్పింది. మరో వైపు బెంగాల్ లో శరణార్ధులుగా ఉన్న వారిని కూడా దేశం నుంచి పంపించేస్తామని రాజ్ నాథ్ సింగ్ సైతం చెప్పారు. వారు దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని బీజేపీ పార్టీ వాదన, వారిని ఉగ్రవాద సంస్థలు లోబరుచుకొని మానవ బాంబులుగా మార్చి భద్రతకి విఘాతం కలిగిస్తారని కేంద్ర ప్రభుత్వం అంటుంది. అయితే బీజేపీ పార్టీ మీది హిందుత్వ ఆరోపణలని మిగిలిన పార్టీలు చేస్తున్నాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే బీజేపీ పార్టీ రోహింగ్యా ముస్లిమ్స్ ని దేశంలోకి రానివ్వమని ఎందుకు అంటుందో అందరికి తెలిసే ఒక ఘటన వెలుగు చూసింది. రాఖినే రాష్ట్రంలో వేల సంఖ్యలో హిందువులు ఉంటారు. తాజాగా ఆర్మీ ఓ గ్రామంలో 28 మంది మృతదేహాలు ఉన్న ఒక సమాధిని గుర్తించింది. ఆ చంపబడ్డ అందరు హిందువులు కావడం ఇక్కడ గమనార్హం. వారిని అతి దారుణంగా, కర్కశంగా చంపేశారు. అందులో 20 మంది మహిళలే ఉండగా 10 ఏళ్ల లోపు పిల్లలు 6 మంది ఉన్నారు. వాళ్ళని రోహింగ్యా ముస్లిమ్స్ చంపేసి అక్కడ సమాధి చేసినట్లు సైన్యం చెబుతున్న మాటల బట్టి తెలుస్తుంది. మరో వైపు రాఖినే రాష్ట్రం నుంచి 30 వేల మంది హిందువులు సురక్షిత ప్రాంతాలకి వలన పోతున్నారు. రోహింగ్యా ముస్లిమ్స్ తమని లక్ష్యంగా చెసుకొని దాడులు చేస్తున్నారని అందుకో రక్షణ కోసం ఇతర ప్రాంతాలకి పోతున్నట్లు వాళ్ళు చెప్పడం గమనార్హం. మరో వైపు ఇప్పటికి రాఖినే రాష్ట్రంలో 4.30 మంది ముస్లిమ్స్ బంగ్లాదేశ్ కి వలస పోయినట్లు తెలుస్తుంది. ఆర్మీ అధికారులు మమ్మల్ని దారుణంగా చంపడం వలన తాము భయంతో వలస పోతున్నట్లు రోహింగ్య వర్గం చెబుతుంది. అయితే అక్కడ మరో వైపు రోహింగ్యా ముస్లిమ్స్ అరాచకాలు అక్కడ ఒక్కొక్కటిగా ఇప్పుడే బయటకి వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments