ఆ తల్లికి కడుపు కోత..వాషింగ్ మెషిన్ లో పడి..!

Sunday, February 26th, 2017, 12:31:15 PM IST


ఇంతకన్నా హృదయ విదారక ఘటన మరొకటి ఉందేమో. ఓ తల్లి దురదృష్టవ శాత్తూ తన ఇద్దరు కవల పిల్లల్ని పోగొట్టుకుంది. శనివారం దేశరాజధాని ఢిల్లీ రోహిణి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కవలలైన రెండున్నరేళ్ల నిశాంత్, నక్షయ ప్రమాదవ శాత్తూ వాషింగ్ మెషిన్ లో పడి మృతి చెందారు.

నిశాంత్, నక్షయ ల తల్లి బట్టలుతికేందుకు వాషింగ్ మెషిన్ లో నీళ్లు నింపింది. డిటర్జెంట్ పౌడర్ తీసుకురావడానికి కిందికి వెళ్ళింది. తిరిగొచ్చి చూస్తే పిల్లలు కనిపించలేదు. ఎంత వెదికినా కనిపించకపోవడంతో ఇరుగు పొరుగు వారు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. పిల్లలు కనిపించడం లేదన్న వార్త విన్న వారి తండ్రి హుటాహుటిన ఆఫీస్ నుంచి తిరిగొచ్చి వెతుకుతుండగా వాషింగ్ మెషిన్ లో పిల్లలు తేలియాడుతూ కనిపించరు. వెంటనే ఆసుపత్రికి పిలల్లను తరలించారు. కానీ పిల్లలు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.దీనితో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వాషింగ్ మెషిన్ లో పడి మునగడం వల్లే పిల్లలు మరణించారని పోలీస్ లు తేల్చారు.