30 వేల కోట్లు అంబానీ ఖాతాలోకి..?

Saturday, October 27th, 2018, 04:23:37 PM IST

దేశాన్ని కుదిపేస్తున్న తాజా వివాదం రాఫెల్ కుంభ‌కోణం. దీని కార‌ణంగానే సీబీఐ డైరెక్ట‌ర్ అలోక్‌వ‌ర్మ‌ను కేంద్రం అర్థాంత‌రంగా త‌ప్పించి సెల‌వుపై వెళ్లాల్సిందిగా కోరడం స‌ర్వ‌త్రా వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలులో అంబానీ హ‌స్తం వుంద‌ని మొద‌టి నుంచి వాదిస్తున్న రాహుల్ గాంధీ సీబీఐపై తాజా వివాదంతో ఆ విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టి మోడీపై ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం బీజేపీకి మింగుడు ప‌డ‌టం లేదు. అడ్డంగా దొరికిన దొంగ‌లా ఏం చేయాలో మోడీకి తెలియ‌డం లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు బాహాటంగానే బీజీఏపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి.

రాఫెల్ ఒప్పందాన్ని త‌న మిత్రుడు అనిల్ అంబానీ కోస‌మే మోడీ కుదుర్చుకున్నాడ‌ని, ఈ ఒప్పందంతో 30 వేల కోట్ల‌ని అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయేలా ప్లాన్ చేశాడ‌ని రాహుల్ సంధిస్తున్న బాణాల‌కు బీజేపీ శ్రేణులు బెంబేలెత్తిపోతున్నాయి. అంబానీ కోసం మోడీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ మొత్తాన్ని ప్ర‌ధాని ముసుగులో దోచేశాడ‌ని రాహుల‌్ ఘాటుగా విమ‌ర్శిస్తున్నాడు. దేశ‌మంతా ఈ విష‌యాన్ని అర్థం చేసుకుంటోంద‌ని శుక్ర‌వారం లోథీ పోలీస్ స్టేష‌న్‌లో రాహుల్ వివ‌రించాడు.

రాఫెల్ కుంభ‌కోణంపై ద‌ర్యాప్తు చేస్తార‌నే అనుమానంతోనే అలోక్‌వ‌ర్మ‌ను సీబీఐ నుంచి త‌ప్పించార‌ని, అంత మాత్రాన వాస్త‌వాలు వెలుగులోకి రాకుండా పోవ‌ని చెప్పారు. న‌న్ను ఎన్నిసార్లు అరెస్టు చేయించినా నిజాన్ని మాత్రం దాచ‌లేర‌ని రాహుల్ స్వ‌రం పెంచ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఎన్నిక‌ల వేల ఎలాంటి బ్ర‌హ్మాస్త్రం కాంగ్రెకు అవ‌స‌ర‌మో అదే రాఫెల్ అంశం అన్న టాక్ న‌డుస్తోంది. సీబీఐ అవినీతి రూపంలో అడ్డంగా దొరికిపోయింద‌ని, ఇక మోడీని, బీజేపీని ఎవ‌రూ కాప‌డ‌లేర‌ని దేశ వ్యాప్తంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.

  •  
  •  
  •  
  •  

Comments