4కోట్ల స‌బ్సిడీ గాల్లో దీపం.. నిర్మాత‌ల వేద‌న‌!!

Saturday, July 28th, 2018, 11:00:50 PM IST

నిర్మాత‌ల‌కు సంబంధించిన 4.10ల‌క్ష‌ల స‌బ్సిడీ సొమ్ము గాల్లో దీపం అయ్యింద‌ని ఫిలించాంబ‌ర్ కార్య‌వ‌ర్గం విచారం వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇదివ‌ర‌కూ చాంబ‌ర్ అధ్య‌క్షుడు సీఎం చంద్ర‌బాబు నాయుడుని ఈ స‌బ్సిడీ రిలీజ్ చేయాల్సిందిగా కోరినా ఎలాంటి ఫ‌లితం లేద‌ని ఆ మొత్తాన్ని నిర్మాత‌ల‌కు ఇప్పించాల్సిందిగా కొత్త‌గా ఎన్నికైన చాంబ‌ర్ అధ్య‌క్షుడికి విన్న‌వించ‌డం విశేషం.

నిర్మాత‌ల మండ‌లి కొత్త కార్యద‌ర్శి వ‌ల్లూరి ప‌ల్లి ర‌మేష్ కొత్త అధ్య‌క్షుడు వీరినాయుడుని ఉద్ధేశించి మాట్లాడుతూ .. ఆయ‌న ఎంతో అనుభ‌వ‌జ్ఞుడు కాబ‌ట్టి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కొత్త స‌మస్య త‌లెత్తింది. 1999 నుంచి చిన్న సినిమాల‌కు స‌బ్సిడీలు ప్ర‌క‌టిస్తున్నారు. అయితే అందులో 4.10 కోట్ల స‌బ్సిడీ శాంక్ష‌న్ అయ్యి కూడా నిర్మాత‌ల‌కు అంద‌కుండా పోయింద‌ని తెలిపారు. వెంట‌నే ఆ మొత్తం ఇరు రాష్ట్రాల సీఎమ్‌లు చంద్ర‌బాబు, కేసీఆర్‌ల‌ను క‌లిసి ర‌ప్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments