అదుర్స్ : పోలవరం నలభై శాతం పూర్తి .. కేంద్రానికి నివేదిక

Thursday, September 29th, 2016, 03:48:09 AM IST

polavaram
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తో పాటు ప్రజలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్న ప్రాజెక్ట్ , పోలవరం ప్రాజెక్ట్. నలభై శాతం వరకూ ఇక్కడ పనులు పూర్తి అయ్యాయి అని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపించింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి నాబార్టు నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం తో అప్పటివరకూ ఆగిపోయిన పనులు చకచకా ముందుకు సాగిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ పనుల మీద దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, ఖర్చులు, తుది గడువు తదితర వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి ఇచ్చింది. ప్రాజెక్టును మార్చి, 2018 నాటికి పూర్తిచేయనున్నట్టు నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్య పేట దగ్గర గోదావరి నది మీద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది, కేంద్ర అటవీ – పర్యావరణ – గిరిజన విషయాలలో ఎనిమిది చట్టబద్ధ అనుమతులు లభించాయి. ప్రాజెక్ట్ పూర్తి అయితే ఏడున్నర లక్షల ఎకరాలకి సాగు నీరు అందించచ్చు. దాంతో పాటు 960 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రాజెక్టు. విశాఖ పట్నం లో ఉండే 28 లక్షల మందికి తాగు నేరు అందుతుంది. అంతే కాకుండా కర్ణాటక , మహారాష్ట్రలు కూడా 21, 14 టీఎంసీల నీటిని పొందుతాయి. 2454 మీటర్ల పొడవైన డ్యామ్లో 1128.40 మీటర్ల గేట్ల పొడవు, 25.72 మీటర్ల ఎత్తైన 48 గేట్లు ఉంటాయి. 50 లక్షల క్యూసెక్కుల వరదను సైతం ప్రాజెక్టు తట్టుకుంటుంది. 75.20 టీఎంసీల నీటిని ప్రాజెక్టు జలాశయం నిల్వచేయగలదు.

  •  
  •  
  •  
  •  

Comments