బాప్‌రే.. దేశంలో 410 మంది సింగ‌ర్లు?!

Wednesday, August 8th, 2018, 11:16:23 PM IST


గాయ‌నీగాయ‌కులు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌కు రాయ‌ల్టీ వ్య‌వ‌హారంపై గ‌త రెండేళ్లుగా విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. అప్ప‌ట్లో త‌నకు ద‌క్కాల్సిన రాయల్టీ గురించి స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్.రెహ‌మాన్ హ‌క్కుల సాధ‌న పేరుతో పోరాటం చేయ‌డంతో అది కాస్త ఉద్య‌మరూపం తీసుకుంది. ఆ త‌ర్వాత టాలీవుడ్ నుంచి దీనిపై పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. ఒక సినిమా రిలీజై ఆడేసి వెళ్లిపోయాక‌, ఆ సినిమాని వేరే వేరే భాష‌ల్లో రిలీజ్ చేసినా.. దానికి ప‌ని చేసిన గాయ‌నీగాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కుల‌కు నిర్మాత రాయ‌ల్టీ చెల్లించే రూల్ ఉందంటూ అప్ప‌ట్లో ప్ర‌భుత్వ పెద్ద‌లే బిల్లు చేశారు. ఆ త‌ర్వాత ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం వంటి ప్ర‌ముఖుల‌కు రాయ‌ల్టీలు అందాయి.

ఇదే విష‌యంపై న‌వ‌త‌రం ట్యాలెంటుకు అవ‌గాహ‌న కల్పించేందుకు నేడు హైద‌రాబాద్ తాజ్ కృష్ణ‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ముఖ్య అతిధి గాన‌గంధ‌ర్వుడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేశారు. రెండేళ్ల క్రితం రాయ‌ల్టీపై బిల్లు పాస్ అయ్యేవ‌ర‌కూ త‌న‌కు రాయ‌ల్టీలే లేవ‌ని వాపోయారు. ఆల్ ఇండియా సింగ‌ర్స్ అసోసియేష‌న్ (ఇస్రా) ఇస్రాలో స‌భ్యులుగా చేరిన‌వారికి రాయ‌ల్టీ వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. ఏదైనా ఒక పాట పాడిన వారు రూ.2వేలు క‌ట్టి ఇందులో స‌భ్య‌త్వం తీసుకోవ‌చ్చ‌ని అన్నారు. ఇప్ప‌టికి 410 మంది స‌భ్యులున్నారని తెలిపారు. అంటే దేశంలో మొత్తం గాయ‌నీగాయ‌కులు ఇందులో స‌భ్యులుగా ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు ఇంకా ఈ సంఖ్య పెరిగే ఛాన్సుంద‌ని బాలు అన్నారు. స‌ద‌స్సులో ఇస్రా బోర్డ్ స‌ల‌హాదారు సంజ‌య్ టాండ‌న్ మాట్లాడుతూ .. 2016లో రూ.51లక్షల రూపాయలను వసూలు చేసి అందరికీ పంచిపెట్టాం. 2017లో రూ.1.2కోట్లను వసూలు చేసి పంచామ‌ని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments