ట్రూకాలర్, షేరిట్..డేంజర్ యాప్ లు..జర జాగ్రత్త..!

Friday, December 1st, 2017, 07:40:28 PM IST

మీ మొబైల్ లో ట్రూకాలర్, షేరిట్ యాప్ లు ఉన్నాయా.. అయితే వెంటనే అన్ ఇన్స్టాల్ చేయడం బెటర్. ఆ యాప్ లతో అంత ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. చైనా తయారు చేస్తున్న ఇలాంటి యాప్ ల పట్ల వినియోగ దారులు అప్రమత్తంగా మెలగాలని సూచిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి కనిపించిన ప్రతి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం ప్రమాదకరం అని అంటున్నారు. వాటి వలన ప్రమాదకరమైన మాల్ వేర్ అటాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయనేది తాజా హెచ్చరిక.

భారత నిఘా వర్గాలు దాదాపు 40 కి పైగా ఇలాంటి యాప్ లపై అనుమానులు ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీటి వలన వ్యక్తిగత భద్రతకే కాక దేశ భద్రతకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనితో ప్రాధమిక చర్యగా భద్రతా భాగాలలో పనిచేసే వారంతా వారి ఫోన్ లని ఫార్మాట్ చేసుకోవాలని రహస్య ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. చైనీస్ యాప్స్ ని సీరియస్ గా తీసుకోవాలని ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments