ఈత చెట్ల లక్ష్యం ఐదు కోట్లా..? తాగడానికేనా..?

Monday, March 12th, 2018, 06:02:51 PM IST

తెలంగాణా రాష్టంలో ఈత మొక్కలు నాటే కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళుతున్నది. రాబోయే 2019 నాటికి రాష్ట్రంలో 5 కోట్ల ఈత మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఆబ్కారీశాఖ దూసుకు పోతున్నది. 2016 జూన్‌లో మొదలుపెట్టిన హరితహారంలో భాగంగా మొదటి విడుతలో 54.84 లక్షల ఈత మొక్కలను నాటింది. 2017లో కోటి 16 లక్షలు, 2018లో రెండు కోట్ల మొక్కలను నాటాలని జిల్లాలవారీగా ఒక నిర్థేశిత లక్ష్యాలను నిర్థారించింది. 2019-20లో 1.3 కోట్ల మొక్కలను నాటాలని గట్టి నిర్ణయం తీస్కుంది. జూన్ నుంచి మొక్కలు నాటే కార్యక్రమాలకు ఎక్సైజ్ ఉన్నతాధికారులు సంబందిత చర్యలు తీస్కున్నారు. కళ్ళు గీసే గౌడ సంఘాలకు ఇచ్చిన భూములు, చెరువులు, కుంటలు, వాగులు, ఒర్రెల గట్లపై ఈత మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యటించి ఈత మొక్కలు నాటేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తున్నారు. స్థానిక గౌడ సంఘం నేతలతో, కల్లుగీత కార్మికులతో డైరెక్టర్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటున్నారు.

వికారాబాద్ జిల్లాలో నాటిన ఈత మొక్కలను ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చూసి ఆశ్చర్య పోయారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, దేశంలో ఈత వనాల పెంపును కేవలం తెలంగాణలోనే చూస్తున్నామని మెచ్చుకోవడంతో ఉబ్బి తబ్బితబ్బయిపోయారు. ఈత చెట్లని ప్రభుత్వమే ప్రోత్సహించడాన్ని అభినందించారు. ఇలాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపడితే మంచి ప్రయోజనాలుంటాయని అభిప్రాయపడ్డారు. కట్టుదిట్టమైన పర్యవేక్షణ: రెండేండ్లలో నాటిన కోటి 70 లక్షల ఈత మొక్కలను పెంచి పోషించేందుకు చెరువుగట్లు, కుంటలు, గౌడ సొసైటీలకు కేటాయించిన స్థలాల్లో వాచ్‌మెన్లను ఏర్పాటుచేశారు. వీరికి రూ.3,500 వేతనం చెల్లిస్తున్నారు. 10,434 పంచాయతీల్లో ఉన్న 6,500 గౌడ సొసైటీలకు ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించిన స్థలాల్లో ఈత మొక్కలను నాటుతున్నారు. ఈత మొక్కల తీరుతెన్నులపై ఇటీవల ఎక్సైజ్‌శాఖ అధ్యయనం చేసింది. దాదాపు 90 శాతం మొక్కలు పెద్దవయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇక నుండి కళ్ళు కార్మికులకు ఆకలి కష్టాలుండవని అధికారులు ఈ సందర్బంగా వెల్లడించారు.

  •  
  •  
  •  
  •  

Comments