పెళ్లి కానుకగా 5 లీటర్ల పెట్రోల్ బహుమానం..!

Monday, September 17th, 2018, 12:41:58 PM IST

ఎవరైనా పెళ్లి కానుకగా ఏవైనా విలువైన వస్తువులో లేక బంగారు ఆభరణాలలో బహుమానంగా ఇస్తారు. కానీ తమిళనాడులోని ఒక వింతైన ఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లి అయ్యిన జంటకు వారి స్నేహితులు పెట్రోలును బహుమతిగా అందించారు. దీనితో ఒక్కసారిగా అందరు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. పెరుగుతున్న పెట్రోలు ధరలను అనుసరించి వారు ఈ వింతైన బహుమానం అందించినట్టు తెలుస్తుంది.

నిన్ననే తమిళనాడు చిదంబరంలోని ఒక జంటకి పెళ్లి అవ్వగా వారి యొక్క స్నేహితులు 5 లీటర్ల పెట్రోలును బహుమానంగా అందించారు. మనకి ఇది చూడటానికి వినడానికి ఒకింత వింతగా ఉన్నా ఇందులో మాత్రం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం సుస్పష్టంగా వ్యక్తం అవుతుంది. సామాన్య ప్రజల మీద మోపుతున్న భారాన్ని, రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోలు ధరలని దృష్టిలో పెట్టుకొని ఈ వింత సంఘటనని మనం గమనించాలి.అంతే కానీ ఎదో వింత సంఘటన అని చెప్పి నవ్వి ఊరుకోకూడదు.