ఇకపై హైదరాబాద్ లో 5రూ.కే భోజనం

Saturday, October 18th, 2014, 10:38:15 AM IST

meals
హైదరాబాద్ లో ఇకపై 5రూపాయలకే భోజనం లభించనుంది. కాగా ఈ మేరకు జీహెచ్ఎంసీ కమీషన్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్యే డా కే లక్ష్మణ్ తో కలిసి 5రూపాయల భోజన పధకాన్ని కేంద్ర గ్రంధాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరేకృష్ణ మూవ్ మెంట్, జీహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ పధకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి భోజనాన్ని హైదరాబాద్ లో 15 సెంటర్లలో అందిస్తామని వారు తెలిపారు.

ఇక హైదరాబాద్ కు పోటీ పరీక్షల నిమిత్తం వివిధ ప్రాంతాల నుండి విద్యార్ధులు వస్తూ ఉంటారని, వారందరికీ నామమాత్రపు ధరకు భోజనం అందించాలనే సదుద్దేశ్యంతోనే ఈ పధకాన్ని ప్రారంభించామని సోమేశ్ కుమార్ తెలిపారు. అలాగే విద్యార్ధుల అవసరాలకు సరిపడా సంపాదన ఉండదనే ఉద్దేశ్యంతో, వారికి మేలు చెయ్యాలనే లక్ష్యంతో ముందుగా గ్రంధాలయంలో ఈ పధకం మొదలుపెట్టామని, ప్రస్తుతం రోజూ 500మందికి భోజనం సమకూరే ఏర్పాట్లు చేశామని, అవసరమైతే వెయ్యి మందికి భోజన సరఫరా అందిస్తామని వారు తెలిపారు.