రాష్ట్రానికి దక్కిన 400 మెడిసిన్ సీట్స్

Thursday, June 6th, 2013, 11:57:56 AM IST


మన రాష్ట్రంలో మెడిసిన్ చదవాలని ఉవ్విళ్ళుఊరేవారు ఎక్కువే కానీ మనకు ఉండే సీట్స్ మాత్రం చాలా తక్కువ. గత కొన్ని రోజులుగా మెడికల్ సీట్లు పెంచాలని చేస్తున్న పోరాటంలో ఎట్టకేలకు రాష్ట్రం కొంతవరకూ విజయం సాధించింది. ఈ సంవత్సరం నుంచి మెడిసిన్ విభాగంలో కొత్తగా 400 సీట్లు చేరనున్నాయి. ఈ 400 సీట్లలో హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ లతో పాటు కాకినాడ, తిరుపతి యూనివర్సిటీలకు విడివిడిగా 50 సీట్లను పెంచారు. దీంతో మంజూరు చేసిన 400 సీట్లలో ప్రభుత్వ కళాశాలల్లో 200 సీట్లను భర్తీ చేయగా, మిగిలిన 200 సీట్లలో 150 సీట్లతో కామినేని హాస్పిటల్స్ కి సంబందించిన కళాశాలని ప్రారంభించడానికి అనుమతివ్వగా, మరో 50 సీట్లను మహబూబ్ నగర్లోని ఎస్వీఎస్ ప్రైవేటు కళాశాలకు మంజూరు చేసింది. అలాగే గుంటూరు, వరంగల్లోని కళాశాలలకు పెంచాల్సిన సీట్ల గురించి వీలైనంత త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో 5500 మెడిసిన్ సీట్లు ఉన్నాయి ఇప్పుడు పెంచిన వాటితో మొత్తం 5900 సీట్లయ్యాయి.

ఇదిలా ఉంటే మెడిసిన్ కి సంబందించిన సంవత్సిరిక ఫీజుల పెంపుపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ప్రైవేటు కళాశాలల యాజమాన్యం కన్వీనర్ కోటా కింద, యాజమాన్య కోటా కింద ఇచ్చే సీట్లకి సంబందించిన ఫీజును ఉన్నదానికి డబుల్ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఎంసెట్ ఫలితాలు కూడా రావడంతో త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.