ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లో భూకంపం..!

Wednesday, January 31st, 2018, 04:55:12 PM IST

రాజధాని నగరం మరో మారు భూ ప్రకంపనలతో వణికిపోయింది. ఈ మధ్యాహ్నం ఢిల్లీ మరియు జమ్మూ కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఇళ్లలోని జనం, కార్యాలయాలలో సిబ్బంది భయబ్రాంతులకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లోని హిందూకుష్ కేంద్రంగా భూకంపం సంభవించిందని ఆ ప్రభావమే ఢిల్లీలో కనిపించిందని జియోలాజికల్ సర్వే ప్రకటించింది.

రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. కొన్ని సెకండ్లు మాత్రమే ప్రకంపనలు రావడంతో ప్రాణ నష్టం జరగలేదు. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ భూకంపం కారణంగా ఓ పక్కకు ఒరిగిపోయినట్లు తెలుస్తోంది.