జియోలో 75వేల ఉద్యోగాలు!

Friday, April 27th, 2018, 09:25:27 AM IST

రిలయన్స్ జియో రాకతో మనదేశంలో ఇంటర్నెట్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జియో విస్తరణలో భాగంగా భారీస్థాయిలో ఉద్యోగానియమాకాలు చేపడుతున్నట్లు ఆ సంస్థ సిహెచ్ఆర్ఓ సంజయ్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎస్ హెచ్ఆర్ఎమ్ ఇండియాటిక్ వారు నిర్వచించిన 18వ సదస్సులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా ఈ నియామకాలు జియో పెమెంట్స్ , బ్రాడ్ బ్యాండ్, బ్యాంకింగ్ విభాగాల్లో తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఐటి, డిగ్రీ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు.

టెలికాం కంపెనీలు మూతపడ్డ, లేదా విలీనమైనా ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతానికి ఈ నియామకాలకు కళాశాలలకు వెళ్లి ప్రాంగణ ఎంపీలకాలద్వారా చాలా వరకు నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగుల సిఫార్సు ఆధారంగా మరికొన్ని ఎంపికలు వుంటాయని ఆయన వెల్లడించారు. కొత్తగా చదువుకుని బయటకి వస్తున్న ఐటి, మార్కెటింగ్ విభాగాల వారికి తమ సంస్థలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని, యువత ఎక్కువశాతం గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు తరలి రావడంవలన ఉద్యోగ అవసరాలు పెరిగాయని అన్నారు. తమ సంస్థలో గత రెండేళ్లలో 1,57,000మంది ఉద్యోగులను ఇప్పటివరకు నియమించినట్లు ఆయన తెలిపారు.

కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి జియో మంచి ఆధారంగా కనిపిస్తోందని, తమ సంస్థలో పనిచేసినవారు మంచి భవిష్యత్తును వెతుక్కుని వెళ్తున్నారు అని అన్నారు. అయితే ఈ తీసుకోబోయే నియామకాల్లో ఫ్రెషెర్లు ఎక్కువగా ఉంటారని, ఆయా శాఖలయందు అనుభవం వున్నవారికి కూడా మంచి అవకాశం తమ సంస్థలో దొరుకుతుందని ఆయన అన్నారు. కాబట్టి ఈ నియామకాల్లో ఎక్కువగా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, మొత్తంగా వున్న 75 వేల ఖాళీలను భర్తీ చేసే దిశగా ఇంటర్వ్యూలు, ఎంపికలను జాగ్రత్తతో నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ….

  •  
  •  
  •  
  •  

Comments