ట్రైలర్ టాక్ : “90ఎంఎల్” పిల్లలు..దూరంగా ఉండాలమ్మ..!

Saturday, February 9th, 2019, 06:01:11 PM IST

ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీకి ఎల్లలు లేకుండా పోయాయి.అప్పుడంటే సినిమాలు తీస్తే ఈ సీన్లు ఉన్నాయి ఆ సీన్లు ఉన్నాయని కొన్ని కొన్ని ఆంక్షలు పెట్టినా సరే ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షుకుల అభిరుచులు కూడా మారుతుండడంతో కంటెంట్ ఉన్న సినిమాలని కాస్త బోల్డ్ గా తీసినా సరే వాటిని జనం బాగానే చూసేస్తున్నారు.అయితే ఈ ధోరణి ఇప్పుడు మారిపోతుంది.ఎందుకంటే ఈ సారి కంటెంట్ తో సంబంధం లేకుండా అడల్ట్ సినిమాలు వచ్చేస్తున్నాయి.ఈ మధ్యనే ఒక తమిళ్ సినిమాకి రీమేక్ చిత్రంగా వచ్చిన “చీకటి గదిలో చితక్కొట్టుడు”ట్రైలర్ యూట్యూబ్ లో ఎంత విధ్వంసం చేసిందో అందరికి తెలుసు కేవలం 18 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఈ సినిమా ని చెప్పేసారు.

ఇప్పుడు కూడా అదే అడల్ట్ కంటెంట్ తో కోలీవుడ్ నుంచి మరో ట్రైలర్ ఇప్పుడు సందడి చేస్తుంది.అదే “90ఎంఎల్” పేరుకి తగ్గట్టుగానే ఈ ట్రైలర్ కూడా అడల్ట్ కంటెంట్ ఇష్టపడేవాళ్లు మరియు 18 ఏళ్ళు దాటిన కుర్రకారుకి కిక్కిచ్చేలా ఉందనే చెప్పాలి.ఈ ట్రైలర్ చూసినట్లయితే తమిల్ బిగ్ బాస్ ఫేమ్ ఒవియా ఈ సినిమాలో రెచ్చిపోయిందనే చెప్పాలి.1:50 సెకెన్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్లో ఊహించని రీతిలో లిప్ లాక్స్ ఉన్నాయి.ఈ సినిమాకి సంగీతం అక్క్కడ స్టార్ హీరో కం సింగర్ కం, శింబు సంగీతాన్ని అందించారు.ఈ ట్రైలర్లో శింబు కూడా కనిపించడం ఒక విశేషం.అళగియ అసుర దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ అతి చిన్న యూట్యూబ్ ఛానెల్ నుంచి విడుదలై 24 గంటలు ముందే 1 మిలియన్ దాటేసింది,మొత్తానికి ఈ ట్రైలర్ మాత్రం ఫుల్ హాట్ గా ఉందని చెప్పొచ్చు..పిల్లలు ఇలాంటి సినిమాలకి ట్రైలర్లకు దూరంగా ఉండాలమ్మా.